హైద్రాబాద్‌ను వణికిస్తున్న వర్షాలు: పాతబస్తీలో పలు కాలనీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Google News Follow Us

సారాంశం

హైద్రాబాద్ నగరంలో  నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో  పాతబస్తీలోని పలు కాలనీ వాసులను  అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

హైదరాబాద్: నాలుగైదు రోజులుగా హైద్రాబాద్ నగరంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాతబస్తీలోని  పలు కాలనీల వాసులను  అధికారులు ఖాళీ చేయించారు.   గోల్కోండ చెరువుకు  అధికారులు గండికొట్టారు. మరో వైపు  భారీ వర్షాల నేపథ్యంలో పాతబస్తీలోని పలు కాలనీల్లో  వరద నీరు  చేరింది. దీంతో ఈ కాలనీల్లోని  ప్రజలను అధికారులు  సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. చాదర్ ఘాట్ , కిషన్ బాగ్,  లంగర్ హౌస్,  కార్వాన్, ఉస్మాన్ నగర్ లలో లోతట్టు ప్రాంతాల వాసులను  అధికారులు  సురక్షిత ప్రాంతాలకు  తరలించారు.

మరో రెండు రోజుల పాటు  హైద్రాబాద్ సహా తెలంగాణలోని  23 జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు  హెచ్చరించారు. దీంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు  రోజులపాటు విద్యాసంస్థలకు  రాష్ట్ర ప్రభుత్వం  సెలవులు  ప్రకటించింది.

మరో వైపు  హైద్రాబాద్ జంట జలాశయాలకు  భారీగా వరద నీరు వస్తుంది.  హిమాయత్ సాగర్  గేట్లు ఎత్తేశారు.  ఉస్మాన్ సాగర్ (గండిపేట) నుండి నీటిని దిగువకు విడుదల చేస్తే మూసీలో  వరద మరింత పోటెత్తే అవకాశం ఉంది.  ఇప్పటికే  మూసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవహిస్తుంది. సోమవారంనాడు  ఇదే బ్రిడ్జిపై నుండి  మూసీ వరద నీరు ప్రవహించింది.

also read:హైద్రాబాద్ సరూర్‌నగర్ చెరువు నుండి నీటి విడుదల: నీట మునిగిన పలు కాలనీలు

భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున  అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత  అతి భారీ వర్షాలు ఈ మాసంలోనే  కురుస్తున్నాయి.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరులో  46 సెం.మీ. వర్షపాతం  నమోదైంది.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడ భారీ వర్షపాతం నమోదైంది.

 

Read more Articles on