పరీక్షలు వాయిదా..

Published : Jul 26, 2023, 06:51 AM IST
పరీక్షలు వాయిదా..

సారాంశం

ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడతో 26, 27న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఓయూ, జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు యూనివర్సీటి పరిధిలో జరగాల్సిన పరీక్షలను వేస్తున్నట్లు రిజిస్టార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?