7 ఏళ్ల బాలుడి నిర్వాకం: 4 ఏళ్ల బాలిక యోనిలోకి పెన్సిల్

Published : Jul 03, 2018, 06:47 AM IST
7 ఏళ్ల బాలుడి నిర్వాకం: 4 ఏళ్ల బాలిక యోనిలోకి పెన్సిల్

సారాంశం

ఓ ఏడేళ్ల బాలుడు నాలుగేళ్ల బాలిక మర్మాంగంలోకి పెన్సిల్ చొప్పించాడు.

హైదరాబాద్: ఓ ఏడేళ్ల బాలుడు నాలుగేళ్ల బాలిక మర్మాంగంలోకి పెన్సిల్ చొప్పించాడు. ఆడ, మగ మర్మాంగాల మధ్య తేడాను తెలుసుకునే ఉత్సుకత కొద్దీ అతను ఆ పని చేశాడు. 

ఈ సంఘటన శనివారంనాడు ఓ ట్యుటోరియల్ లో జరిగింది. బాలికకు రక్తస్రావం కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో బాలిక కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లైంగిక దాడి ఏదీ జరగలేదని, మర్మాంగాల్లో తేడాను తెలుసుకునే ఉత్సుకత కొద్దీ బాలుడు ఆ పనిచేశాడని  కౌన్సెలింగ్ లో తేలిందని పోలీసులు చెప్పారు. 

శనివారంనాడు ఇద్దరు పిల్లలు కూడా ట్యూషన్ కు వెళ్లారు. టీచర్ లేని సమయంలో ఇరువురు బయటకు వచ్చారు. ఆ సమయంలో బాలుడు పెన్సిల్ ను బాలిక మర్మాంగంలోకి చొప్పించాడు. దాంతో రక్తస్రావం జరిగింది. ఈ విషయాన్ని బాలుడు అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu