హైద్రాబాద్ దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పిల్లలున్నారు. ఈ ప్రమాదం వల్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది
హైదరాబాద్: నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులున్నారు. దోమలగూడలోని రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా ఈ ఇంట్లోని ఏడుగురు గాయపడ్డారు. ఇంట్లో నుండి మంటలు వెలువడుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు.
ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించాల్సిన రెగ్యులేటర్ కు బదులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించే రెగ్యులేటర్ ను ఉపయోగించడం ప్రమాదానికి కారణంగా అధికారులు చెబుతున్నారు.బోనాల పండుగను పురస్కరించుకొని పిండివంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించినట్టుగా అధికారులు తెలిపారు.
also read:ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం: దగ్ధమైన బోగీలను పరిశీలించిన క్లూస్ టీమ్
గ్యాస్ సిలిండర్ పేలుడుతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు దేశ వ్యాప్తంగా నమోదౌతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడ ఉన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పకట్టలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడ్డారు. తల్లీతో పాటు ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. 2022 డిసెంబర్ 4న చోటు చేసుకుంది.
హైద్రాబాద్ మైలార్ దేవ్ పల్లిలోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇళ్లు పూర్తిగా దెబ్బతింది. అయితే ఇంట్లో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటన ఈ ఏడాది మే 10వ తేదీన చోటు చేసుకుంది. రవిరంజన్ కుమార్ నివాసంలో ఈ ప్రమాదం జరిగింది.సికింద్రాబాద్ చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒకరు మృతి చెందారు. 2022 అక్టోబర్ 26న ఈ ప్రమాదం జరిగింది.