ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెడతారా అని ఆయన కాంగ్రెస్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్: మూడు గంటల ఉచిత విద్యుత్ రైతులకు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తప్పుబట్టారు. వ్యవసాయం గురించి అవగాహన లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటరిచ్చారు.మంగళవారంనాడు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.ఉచిత విద్యుత్ ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెడతారా అని కాంగ్రెస్ ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం తేలిందన్నారు.
undefined
రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అమలు చేయలేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని రైతులు ఆందోళనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఆయన చెప్పారు. దేశంలో వ్యవసాయరంగాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. గతంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత పాలన చేసిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఎందుకు ఏడుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
also read:ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల చిచ్చు: రెండు రోజుల పాటు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
వ్యవసాయానికి మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీష్ రెడ్డి తప్పు బట్టారు. కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల బాధలు తెలిస్తే ఇంత దుర్మార్గమైన మాటలు కాంగ్రెస్ నేతలకు రావన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, తమ పార్టీ నిరసనకు దిగుతామని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. కాంగ్రెస్ వైఖరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు.