
టిఎస్ పిఎస్‌సికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 2 లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 2 నిర్వహణలో అక్రమాలు జరిగాయని కొందరు నిరుద్యోగులు కోర్టు తలుపు తట్టారు.
దీంతో స్పందించిన హైకోర్టు మూడు వారాల పాటు గ్రూప్ 2 నిర్వహణ ప్రక్రియ జరపరాదని ఆదేశించింది.
మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది.
1032 పోస్టులకు గత నవంబరులో పరీక్ష నిర్వహించింది టిఎస్‌పిఎస్‌సి
దేశంలోనే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయని రీతిలో ఆన్‌లైన్ లో అద్భుతంగా గ్రూప్2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు తీర్పు చెంప పెట్టు అని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. లోపభూయిష్టంగా గ్రూప్ 2 నిర్వహణ సాగుతోందని గత కొంత కాలంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చర్య సర్కారుకు మింగుడు పడని అంశంగా చెబుతున్నారు.