rythu bandhu: బ్యాంకులకు వరుస సెలవులు.. రైతు బంధు డబ్బులు పడేది ఆ రోజే!

By Mahesh K  |  First Published Nov 25, 2023, 5:38 PM IST

బ్యాంకులకు వరుస సెలవులు వస్తుండటంతో ఈ నెలలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయా? అనే సందేహం నెలకొంది. బ్యాంకులకు వరుసగా 25,26,27వ తేదీల్లో సెలవులు ఉన్నాయి. 29, 30వ తేదీల్లో డబ్బులు వేయవద్దని ఎన్నికల సంఘం షరతు పెట్టింది.
 


హైదరాబాద్: తెలంగాణ రైతుల్లో ఎన్నికలతోపాటు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయా? అనే ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎన్నికల ముంగిట్లో రైతు బంధు నిధులు విడుదల చేయనివ్వద్దని, ఆ డబ్బులు ఓటర్లను ప్రభావితం చేసే ముప్పు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగింది. కానీ, రైతుల్లో మాత్రం అనిశ్చితి ఏర్పడింది. అయితే.. ఎన్నికల సంఘం కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఎన్నికల సంఘమైతే అనుమతి ఇచ్చింది కానీ, డబ్బులు ఎప్పుడు అకౌంట్‌లో పడతాయా? అనేది సందేహంగా మారింది. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బ్యాంకులకు వరుసగా శని, ఆది, సోమవారాల్లో సెలవులు ఉన్నాయి. అంటే 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎన్నికలు ఈ నెల 30వ తేదీ. 29, 30వ తేదీల్లో డబ్బులు వేయొద్దని ఎన్నికల సంఘం కండీషన్ పెట్టింది. దీంతో 28వ తేదీ రోజు మాత్రమే రైతు బంధు డబ్బులు వేయడానికి ఆస్కారం ఉన్నది.

Latest Videos

Also Read: Insta Reels: నిండు ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్.. భార్యను దారుణంగా హతమార్చిన భర్త

రైతు బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి యేటా అంటే.. రెండు సీజన్లు కలిపి రూ. 10 వేలు పెట్టుబడి సాయంగా పట్టా రైతులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఖరీఫ్ సీజన్ కోసం రైతు బంధు పెట్టుబడి డబ్బులు నవంబర్ నెలలో రైతుల ఖాతాల్లో పడాల్సి ఉన్నాయి.

click me!