హలాల్ ఉత్పత్తుల నిషేధం..? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చెప్పారంటే ?

By Asianet News  |  First Published Nov 25, 2023, 3:56 PM IST

హలాల్ ఉత్పత్తుల నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ అన్నారు. తెలంగాణ ప్రజలు పార్టీల పనితీరును విశ్లేషించుకొని ఓటు వేయాలని కోరారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధంపై వస్తున్న వార్తలపై మట్లాడారు.. హలాల్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు.

జీతం అడిగాడని దళిత యువకుడిని చెప్పు నాకించిన మహిళా వ్యాపారవేత్త.. క్షమాపణలు చెప్పాలనీ ఒత్తిడి..

Latest Videos

undefined

అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అన్ని పార్టీల పని తీరును విశ్లేషించుకొని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. దశాబ్ద కాలంగా పోటీలో ఉన్న పార్టీల పనితీరును చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు వేసే ఒక ఓటు ఎమ్మెల్యే లేదా ప్రభుత్వ భవితవ్యాన్ని మాత్రమే నిర్ణయించదని అన్నారు. అది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. 

ప్రతీ పార్టీ పనితీరును విశ్లేషించిన తర్వాతే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ల కిందట తెలంగాణ మిగులు రెవెన్యూ రాష్ట్రంగా ఉందని అన్నారు. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. నేటి యువత నిరుత్సాహానికి గురవుతోందని తెలిపారు. రైతులు, దళితులు, వెనుకబడిన వారు నిరుత్సాహానికి గురవుతున్నారని, తెలంగాణ భవిష్యత్తుపై ప్రతి ఒక్కరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

భళా కంబళ.. తొలిసారిగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో నిర్వహణ.. ఏమిటీ పోటీలు.. ? (ఫొటోలు)

బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యూహాత్మక కూటమి లేదా రాజకీయ కూటమిని ఏర్పాటు చేయబోవని అమిత్ షా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగం ఎవరికీ ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వడానికి అనుమతించదని, అయితే సీఎం కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ 4 శాతం కోటాను రద్దు చేసి, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. 

click me!