లిక్కర్ స్కామ్: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ యాక్షన్! పిళ్లై రిమాండ్‌ రిపోర్టులో సంచలన వ్యాఖ్యలు

Published : Mar 08, 2023, 06:51 PM IST
లిక్కర్ స్కామ్: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ యాక్షన్! పిళ్లై రిమాండ్‌ రిపోర్టులో సంచలన వ్యాఖ్యలు

సారాంశం

లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపడం రాజకీయంగా దుమారం రేపింది. గతేడాది ఆగస్టులో సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు పేర్కొంది. కవితకు పిళ్లై బినామీ అని ఆరోపించింది.  

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుతో లిక్కర్ స్కామ్ హీట్ పెరిగింది. తాజాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడంతో తెలంగాణలోనూ రాజకీయ దుమారం రేగింది. సాధారణంగా ఈడీ ఆర్థిక అవకతవకల కోణంలో దర్యాప్తు చేస్తుందని తెలిసిందే. ఈసీఐఆర్ ఫైల్ చేసి ఈడీ రంగంలోకి దిగుతుంది. ఈసీఐఆర్ ఫైల్ చేయడానికి ఈడీ గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను ఆధారం చేసుకుంది.

గతేడాది ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌ను ఆధారంగా చేసుకునే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును ఈడీ ఫైల్ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్లు 477ఏ, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు పంపినట్టు ఉన్నది. గతేడాది డిసెంబర్‌లో సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌కు తోడు అరుణ్ రామచంద్ర పిళ్లై స్టేట్‌మెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు దర్యాప్తులో ఉపకరించనుంది. 

ఇదిలా ఉండగా అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలను పేర్కొంది. పిళ్లైను స్పష్టంగా కవితకు బినామీ అని తెలిపింది. ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలు కాపాడటానికే ఆయన సౌత్ గ్రూప్‌లో ఉన్నాడని ఆరోపించింది.

Also Read: కాంగ్రెస్ లో కవిత చిచ్చు: రేవంత్ రెడ్డిని నిలదీసిన కోమటిరెడ్డి

లిక్కర్ బిజినెస్‌లో 12 శాతం లాభం ఉండేలా లిక్కర్ పాలసీని రూపొందించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అందులో 6 శాతం సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీకి చెరేలా డీల్ కుదుర్చుకున్నారని, ఇండో స్పిరిట్, బ్రిండ్ కో, మహదేవ్ లిక్కర్స్.. ఈ మూడు కంపెనీల్లో ఏటా రూ. 3,500 కకోట్ల బిజినెస్ నడుస్తున్నదని తెలిపింది. వీటికి ఆ 12 శాతం లాభాల కింద యేటా రూ. 400 కోట్లు ఆర్జించాయని, అందులో 210 కోట్లు డీల్ ప్రకారం ఆప్‌కు పిళ్లై టీమ్‌కు రూ. 296.2 కోట్లు వెళ్లాయని పేర్కొంది. అలా వచ్చిన ముడుపులతో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించింది. కల్వకుంట్ల కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పని చేశారని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?