సీనియర్ చెస్ క్రీడాకారుడు ఒకరు చెస్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వచ్చేసి క్రీడాకారుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీనియర్ క్రీడాకారుడైన ఆ వ్యక్తి చేసి ఆడుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… యూసుఫ్ గూడాలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరిగింది.
దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలకు హైదరాబాదులోని అంబర్పేట్ ఆరవ నెంబర్ సర్కిల్ దగ్గర ఉన్న సాయిమిత్ర ఎస్టేట్స్ లో ఉండే వి.ఎస్.టి. సాయి (72) అనే సీనియర్ చెస్ క్రీడాకారుడు శనివారం మధ్యాహ్నం వచ్చారు. ఆ టోర్న మెంట్ లో ఆయన కూడా పాల్గొని ఆడుతున్నారు.
undefined
వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న దిశా కేసు విచారణ అధికాారి.. కారణమిదేనా..?
ఆట ఐదవ రౌండ్ లో ఉండగా ఒక్కసారిగా ఆయనకు గుండెల్లో నొప్పి వచ్చింది. దీంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు.. స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ సంస్థ సిబ్బంది అది గమనించి వెంటనే సాయిని ఆడిటోరియం సెక్యూరిటీ అంబులెన్స్ ను పిలిపించి దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
సాయికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్ఐసిలో అధికారిగా పనిచేసిన సాయి.. రిటైర్ అయ్యారు. ఆయనకి చెస్ క్రీడ అంటే చాలా మక్కువ. ఎక్కడ చెస్ టోర్నీలు జరిగినా తప్పకుండా హాజరవుతుంటారు. అనేకమంది చెస్ క్రీడాకారులకు ఆయన సుపరిచితం. ఆయన హఠాన్మరణానికి నగరానికి చెందిన పలువురు సీనియర్ చెస్ ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేశారు.