హైద్రాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను ఈసీ నియమించింది. హైద్రాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను ఈసీ బదిలీ చేసింది.
హైదరాబాద్: హైద్రాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం పలువురు సీపీలు, కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుండి ఈసీ తప్పించింది. విధుల నుండి తప్పించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఈసీ ఆదేశించింది.ఈసీ ఆదేశాల మేరకు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల జాబితాను నిన్న సీఎస్ శాంతికుమారి నిన్న పంపారు. ఇవాళ మధ్యాహ్నానికి బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైద్రాబాద్ సీపీ స్థానానికి శుక్రవారం నాడు సాయంత్రం ఈసీ నిర్ణయం తీసుకుంది. సందీప్ శాండిల్యను హైద్రాబాద్ సీపీగా నియమించింది.
1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తొలి నాళ్లలో సందీప్ శాండిల్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా తదితర జిల్లాల్లో పనిచేశారు. తెలంగాణ పోలిస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య ఉన్నారు.
undefined
also read:ఈసీ ఆదేశాలు:తెలంగాణలో 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు, నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
మూడు రోజుల క్రితం పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను విధుల నుండి ఈసీ తప్పించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అధికారులకు బాధ్యతలు కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ అధికారుల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు కేటాయించాలని ఈసీ సూచించింది.ఈ మేరకు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై రహస్య నివేదికను సీఎస్ నిన్న ఈసీకి పంపింది.ఈ జాబితా ఆధారంగా ఈసీ ఆయా పోస్టులకు అధికారుల పేర్లను ఫైనల్ చేస్తూ సీఎస్ కు సమాచారం పంపింది.ఈ సమాచారం ఆధారంగా కొత్త అధికారుల నియామాకానికి సంబంధించి సీఎస్ ఉత్తర్వులను జారీ చేశారు .