బీసీలకు పెద్దపీట: 35 నుండి 40 అసెంబ్లీ సీట్లలో బీసీలకు బీజేపీ టిక్కెట్లు

By narsimha lode  |  First Published Oct 13, 2023, 4:54 PM IST

బీసీలకు పెద్దపీట వేయాలని బీజేపీ భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజికవర్గాలకు  టిక్కెట్ల కేటాయించనుంది  కమలదళం.


హైదరాబాద్: బీసీలకు పెద్ద పీట వేయాలని  బీజేపీ భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  35 నుండి  40 అసెంబ్లీ స్థానాలను బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. తెలంగాణ జనాభాలో  50 శాతానికిపైగా బీసీ జనాభా ఉంది. దీంతో  టిక్కెట్ల కేటాయింపులో  బీసీలకు పెద్దపీట వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.  ఈ విషయమై బీజేపీ నాయకత్వం వ్యూహారచన చేస్తుంది.

ఈ నెల  15న తొలి జాబితాను విడుదల చేయాలని బీజేపీ భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  కోసం ఆశావాహుల నుండి బీజేపీ ధరఖాస్తులను ఆహ్వానించింది. సుమారు 6 వేల ధరఖాస్తులు అందాయి.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా ధరఖాస్తులు అందాయి.

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీ  కూడ  బీసీలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం  34 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ఆపార్టీ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు  మాత్రం  48 అసెంబ్లీ స్థానాలను  కోరుతున్నారు.  

తెలంగాణలో ఈ దఫా పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే  టిక్కెట్ల కేటాయింపులో  బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.  కనీసం  35 అసెంబ్లీ స్థానాలు  కేటాయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.  ముదిరాజ్ సామాజిక వర్గానికి  ఐదు సీట్లు కేటాయించాలని  బీజేపీ నాయకత్వం  భావిస్తుంది.

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పక్కా ప్లాన్‌తో కమల దళం,అసెంబ్లీకో ఇంచార్జీ

గత కొంత కాలంగా తెలంగాణలో సునీల్ భన్సల్ నేతృత్వంలో టీమ్ పనిచేస్తుంది.క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిని సునీల్ భన్సల్ టీమ్  చేపట్టింది.  ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాన్ని  జోన్లుగా విభజించింది ఆ పార్టీ.  ఈ జోన్లకు ఇతర రాష్ట్రాలకు చెందిన  ప్రజా ప్రతినిధులను ఇంచార్జీలుగా నియమించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు వారం రోజుల పాటు పర్యటించి  పార్టీ పరిస్థితిపై  నివేదికను  కేంద్ర నాయకత్వానికి అందంచారు. ఈ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై  ఆ పార్టీ కేంద్రీకరించింది.  ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. 
 

click me!