మరోవైపు కవిత రేవంత్ సర్కార్ పై మరిన్ని విమర్శలు కూడా చేశారు. సోషల్ వెల్ఫేర్ కు ఇప్పటివరకు మంత్రిలేరని ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదు ఎందుకని మండిపడ్డారు.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మండలిలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. వీటిని సీతక్క తిప్పికొట్టారు. దీంతో కవిత, సీతక్కల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. బుధవారం నాడు మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేస్తున్నయాత్ర మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ యాత్రకు బస్సులు పోతున్నాయని, ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంలా మారిపోయిందని మండిపడ్డారు. ఓ ప్రైవేటు ఛానల్ లో మండలి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని అన్నారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆత్మస్తుతి, పరానిందగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో 10% కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం పెట్టినా ప్రజావాణి వినడం లేదని ఢిల్లీ వాణి వింటున్నారని అన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి మీద సెటైర్లు వేస్తూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయి అంటూ విమర్శించారు.
చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతాం.. కేసీఆర్ పై రేవంత్ సెటైర్..
దీనిమీద మంత్రి సీతక్క కవితకు కౌంటర్ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన బస్సునే రాహుల్ యాత్రకు పంపించామని చెప్పారు. ఎఐసిసి పెట్టిన ఖర్చు ప్రభుత్వ ఖర్చు కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదంతా కాంగ్రెస్ పార్టీ ఖర్చు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహారాష్ట్ర, పంజాబ్ రైతులకు నిధులు ఇచ్చారని స్పష్టంగా చెప్పుకొచ్చారు.
మరోవైపు కవిత రేవంత్ సర్కార్ పై మరిన్ని విమర్శలు కూడా చేశారు.సోషల్ వెల్ఫేర్ కు ఇప్పటివరకు మంత్రిలేరని ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదు ఎందుకని మండిపడ్డారు. 1.39 లక్షలమంది మహిళలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఇంకా స్పష్టత, ఆడ బిడ్డలకు లక్షరూపాయలు, తులం బంగారం ఇస్తామన్నారని దాని ఊసే లేదని అన్నారు. గృహ జ్యోతి ప్రారంభిస్తామన్నారు. ఇవన్నీ ఎప్పుడూ అమలు చేస్తారని ప్రశ్నించారు.
ఇక ఇందిరమ్మ ఇల్లు పథకానికి కేవలం 7 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. పాత పెన్షన్లే ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అని ఎద్దేవా చేశారు. రేపు సేవాలాల్ జయంతి అని ఈ సందర్భంగా సెలవు ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కేసీఆర్ కున్న బస్సులకే జెండాలుపుతూ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు.