
ఎట్టకేలకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికల పూర్తయ్యింది. దీంతో ఎన్నో రోజులుగా ఆ పార్టీ నాయకుల, కార్యకర్తల ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన
అలాగే మరో ఇద్దరు ఉత్తర తెలంగాణకు చెందిన బీజేపీ నేతలకు కూడా కీలక పదవులు దక్కాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యేలకు బీజేపీ శాసనసభ పక్ష ఉప నేతలుగా నియామకం అయ్యారు. ఇందులో రెండు పదవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులే దక్కడం గమనార్హం. నిర్మల్ గతంలో ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే.
బీజేఎల్పీ నేతగా ఎన్నికైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009 మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీని నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఆయన బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించింది.
అయ్యో.. మాజీ మంత్రులకు చేదు అనుభవం.. మీడియా పాయింట్ కు రానివ్వని పోలీసులు, మార్షల్స్ (వీడియోలు)
ఇక బీజేఎల్పీ ఉపనేతగా ఎన్నికైన పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. మూడో సారి గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక మరో నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత సంచలన వ్యక్తిగా మారారు. ఆ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు సీఎం అభ్యర్థులు పోటీ చేయడం, ఆ ఇద్దరు ముఖ్య నేతలను ఓడించడంతో ఆయనకు కేంద్ర మంత్రులు కూడా ప్రశంసలు కురిపించారు.