బంజారాహిల్స్ లో యువకుడి హత్య కలకలం రేపుతోంది. బీహార్ వలసకూలీని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ సెక్యూరిటీ గార్డులు కొట్టి చంపారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీహార్ కు చెందిన ఓ వలసకూలీని సెక్యురిటీ గార్డులు కొట్టి చంపారు. ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదు రోజులక్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. రాత్రిపూట వర్కర్లు మొబైల్ లో పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఆ సమయంలో సెక్యురిటీ గార్డులు వారిని వారించడంతో వివాదం చెలరేగింది. దీంతో సెక్యూరిటీ గార్డులు చేసిన దాడిలో పంకజ్ అనే వలసకూలీ మృతి చెందాడు. అతను బీహార్ కు చెందిన వ్యక్తిగా సమాచారం.
undefined
సైట్ లో వలసకూలీలను సెక్యూరిటీ గార్డులు కర్రలు , రాడ్తలో కొట్టారు. దీంతో పంకజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీ బైటికి పొక్కనివ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి వచ్చిన మిగతా కూలీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలా విషయం వెలుగు చూసింది. అయితే, దీనిమీద సైట్ లో ఉన్న ఇంచార్జులు మాట్లాడడానికి ఇష్టపడలేదు.
చనిపోయింది నిజమే కానీ, ఎలా చనిపోయాడు, ఏం జరిగింది తమకు తెలియదంటూ దాటివేసే ప్రయత్నం చేశారు.