అక్కా అంటూనే... అన్నీ చేశాడు

Published : Sep 22, 2017, 07:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అక్కా అంటూనే... అన్నీ చేశాడు

సారాంశం

వరుసపెట్టి అమ్మాయిలను వేధించిన అభిషేక్ సిసిఎస్ పోలీసుల విచారణలో వివరాలు వెలుగులోకి అమ్మాయిల స్నేహం కోసం వికృత చర్యలు

తెలంగాణలో సంచలనం సృష్టించింది టిఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు అరెస్టు కేసు. ప్రస్తుతం మల్కాజ్ గిరి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్ రిమాండ్ లో ఉన్నాడు. అయితే ఈ కేసులో విచారణ జరిపిన సిసిఎస్ పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు సేకరించారు. అభిషేక్ అమ్మాయిలను వేధించిన తీరు తెన్నుల వివరాలు సిసిఎస్ పోలీసులు సేకరించారు. అభిషేక్ లీలలు చూస్తే అపరిచితుడు సినిమాను గుర్తు చేసుకుంటున్నారు పోలీసులు.

అభిషేక్ ఎలా వ్యవహరించేవాడంటే... ముందుగా తన చిన్నాటి స్నేహితురాళ్లకు అక్కా బాగున్నావా అంటూ వాట్సాప్ లో మెసేజ్ చేస్తాడు. మంచివాడిగానే మాట్లాడుతాడు. మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం గుర్తుందా అంటూ తియ్యగా చాట్ చేస్తాడు. నేను హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్న అని వాళ్లకు దగ్గరయ్యేలా చాట్ చేస్తాడు. మనం ఒకసారి కలుద్దాం అంటూ ప్రపోజల్ పెడతాడు. టచ్ లో ఉంటాను అక్కా అంటూ చెబుతాడు.

తర్వాత పరిచయం పెరిగిన వెంటనే ఇంకో నెంబర్ తో వాట్సాప్ లోకి టచ్ లోకి వెళ్లి కొన్ని మార్పింగ్ ఫొటోలు వాట్సాప్ లో పెడతాడు. ఈ ఫొటోలు పోర్న్ స్టార్ వి. కానీ నీకు మార్పింగ్ చేశాను. నువ్వు నాతో రోజు మాట్లాడకపోతే నీ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పెడతా అంటూ భయపెడతాడు. పోలీసులకు చెబితే పోర్న్ స్టార్ వీడియోలకు నీ మొహం అతికిస్తా అని బెదిరిస్తాడు.

ఇలా రెండు సిమ్ కార్డులతో అమ్మాయిలను వేధించడం పనిగా పెట్టుకున్నాడు అభిషేక్ గౌడ్. ఇలా సుమారు 10 మంది అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరా తీశారు. అయితే అతి కష్టం మీద ఆధారాలు సేకరించిన పోలీసులు అభిషేక్ ను అరెస్టు చేయగలిగారు.

కొందరు అమ్మాయిల వద్ద మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులకు గురిచేస్తూనే మరోవైపు వాళ్లను రక్షించేందుకు తాను పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా ఇంకో నెంబరుతో టచ్ లో ఉండేవాడు. ఒక ఫోన్ నెంబరుతో వేధింపులకు గురిచేయడం మరో ఫోన్ నెంబరుతో రక్షించే వ్యక్తిగా కవరింగ్ చేసుకోవడం అచ్చం అపరిచితుడు సినిమాను తలపిస్తోందని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తనకు ఎక్కువ మంది అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ ఉండాలన్న ఉద్దేశంతోనే అభిషేక్ ఇలా వ్యవహరించినట్లు పోలీసులు అంటున్నారు. మరి రిమాండ్ లో ఉన్న అభిషేక్ ను పోలీసులు లోతుగా విచారిస్తే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. అప్పుడప్పుడు రేవ్ పార్టీలకు హాజరవుతూ అమ్మాయిలతో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేసినట్లు కూడా అంటున్నారు.

మొత్తానికి రాజకీయ నేతలు డబ్బు యావలో పడి, అధికారం కోసం తాపత్రయపడుతూ తమ సంతానాన్ని సరిగా చూసుకోకుండా  గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు జనాలు. 

ఈ అభిషేక్ రేవ్ పార్టీలో అమ్మాయిలతో ఎలా రెచ్చిపోయి డ్యాన్స్ చేసిండో కింద వీడియోలో చూడండి.

 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్