రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

By narsimha lodeFirst Published May 10, 2019, 11:49 AM IST
Highlights

రెండో రోజు కూడ టీవీ 9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం.  టీవీ9లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్: రెండో రోజు కూడ టీవీ 9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం.  టీవీ9లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గురువారం నాడు ఉదయం టీవీ9 కార్యాలయంలోనూ, రవిప్రకాష్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. అయితే ఈ విషయమై గురువారం రాత్రి రవిప్రకాష్ వివరణ ఇచ్చారు. టీవీ ఛానెల్‌లో కొద్దిసేపు ఈ విషయమై మాట్లాడారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ నెల 16 వ తేదీన ఎన్‌సీఎల్‌టీలో కేసు ఉన్నందునే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రవిప్రకాష్ ప్రకటించారు. తనపై కొన్ని ఛానెల్స్ అబద్దాలను ప్రచారం చేశారని చెప్పారు. అంతేకాదు అబద్దాలు చెప్పినందుకు ఆయన ధన్యవాదాలు కూడ చెప్పిన విషయం తెలిసిందే.

టీవీ9 వాటాల విక్రయం విషయంలో  కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ కు మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా రవిప్రకాష్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ ఫిర్యాదులో భాగంగా గురువారం నాడు, శుక్రవారం నాడు కూడ టీవీ 9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం నాడు తమ ముందు హాజరుకావాలని రవిప్రకాష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

click me!