లైంగికదాడి, హత్య: ఘటన స్థలంలోనే కండోమ్ ప్యాకెట్

Published : May 10, 2019, 11:33 AM IST
లైంగికదాడి, హత్య: ఘటన స్థలంలోనే కండోమ్ ప్యాకెట్

సారాంశం

 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించిన మహిళది  హత్యేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తుర్కపల్లి: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించిన మహిళది  హత్యేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి  కర్రె అనురాధ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. 30 ఏళ్ల క్రితం ఆమెకు బిక్షపతితో వివాహమైంది. 12 ఏళ్ల క్రితం బిక్షపతి అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి సంతానం లేదు. అనురాధ గ్రామంలో బెల్ట్‌షాపు పెట్టుకొని జీవిస్తోంది.

అయితే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అనురాధ స్థానికులతో మాట్లాడి వచ్చిందని  స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంటి ముందున్న తలుపు గడియపెట్టి ఉండడం ఇంట్లో మాత్రం ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం విని స్థానికులకు అనుమానం వచ్చింది.

ఇంటి వెనుక వైపున ఉన్న తలుపు కూడ గడియపెట్టి ఉంది. ప్రహరీ దూకి కిటీకిలో నుండి చూస్తే అనురాధ ఒంటిపై బట్టలు లేకుండా గొంతు నుండి రక్తం కారినట్టుగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఘటన స్థలంలో నిరోధ్ ప్యాకెట్ లభ్యమైంది. 8 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారని బంధులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..సంఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, రాచకొండ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులుతో పాటుగా ఎస్‌ఐ వెంకటయ్య పర్యవేక్షించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్