నాలుగో తరగతి బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. అరెస్ట్..

Published : Feb 07, 2022, 09:26 AM IST
నాలుగో తరగతి బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. అరెస్ట్..

సారాంశం

ఒంటరిగా గదిలో ఉన్న నాలుగో తరగతి విద్యార్థినిపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టాడు.. ఆమె అరుపులు విన్న మిగతా సిబ్బంది ఆమెను రక్షించారు. 

హైదరాబాద్ : ఛత్రినాకలోని ఓ పాఠశాలలో 4వ తరగతి studentపై పాఠశాల ఉపాధ్యాయుడు Sexual harassmentకు యత్నించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై Pocso Act, జువైనల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ ఉల్లంఘన కింద అభియోగాలు నమోదు చేశారు. Accused (35)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శనివారం ఉదయం బాధితురాలు 8 గంటల ప్రాంతంలో schoolకు వచ్చింది. అప్పటికి ఇంకా ఆమె క్లాస్ లోని విద్యార్థులెవ్వరూ రాలేదు. దీంతో ఒంటరిగా గదిలో కూర్చుంది. “విద్యార్థి తరగతి గదిలో ఒంటరిగా ఉండడం చూసిన నిందితుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ చిన్నారి బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడ్డ బాలిక కేకలు వేసింది. దీంతో నిందితుడు బాధితురాలిని అరవొద్దు అంటూ గట్టిగా కొట్టాడు. బాలిక అరుపులు విన్న పాఠశాలలోని ఇతర సిబ్బంది ఆ బాలికను రక్షించారు” అని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు.

ఘటనపై పాఠశాల యాజమాన్యం బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్కూలుకు చేరుకుని బాలికతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు mentally disturbedగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటనలో  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి భద్రత దృష్ట్యా ఆమె గుర్తింపును బయటపెట్టలేదు. అయితే నిందితుడి పేరును కూడా రివీల్ చేయకపోవడం మీద అనేక  ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. 

ఇదిలా ఉండగా, Karnataka లోని శివమొగ్గలో దారుణ ఘటన జరిగింది. 
Minor అయిన భార్య చెల్లెలిని మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడో కీచక బావ. సదరు బావ మీద జిల్లాలోని కుంసి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను తోబుట్టువుల చూసుకోవాల్సిన brother-in-law ఆమె మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని sexual desires తీర్చుకుంటున్నాడు. 

ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బాలిక ఏడు నెలల pregnant అని వైద్యులు తెలిపారు. దీంతో అక్క షాక్ కు గురైంది. తరువాత బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. బయటికి పొక్కితే సంసారం ఇబ్బందుల్లో పడుతుందనుకుందో ఏమో.. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి.. గొడవలు లేకుండా ఇంటికి తీసుకువచ్చారు. 

అనంతరం బాలికకు నొప్పులు రాగా మెగ్లాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు.  ఏడు నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సదరు కీచక బావను కటకటాల్లో కి తరలించారు.

తీర్థ హళ్లిలో మరో కేసు : తీర్థ హళ్లి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది.తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu