నేడు యాద్రాద్రికి కేసీఆర్.. మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శన యాగంలపై సమీక్ష...

Published : Feb 07, 2022, 07:03 AM IST
నేడు యాద్రాద్రికి కేసీఆర్.. మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శన యాగంలపై సమీక్ష...

సారాంశం

నేడు సీఎం కేసీఆర్‌ యాదాద్రికి వెళ్లనున్నారు. ముగింపు ద‌శ‌లో ఉన్న నిర్మాణ ప‌నుల‌ను సీఎం ప‌రిశీలిస్తారు.  ఆల‌య పునఃసంప్రోక్ష‌ణ కోసం నిర్వ‌హించ‌నున్న సుద‌ర్శ‌న‌యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు.   

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి KCR సోమవారం yadadriలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటారు.  ముగింపు దశలో ఉన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా చేపట్టే పున ప్రారంభ కార్యక్రమం సందర్భంగా మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై Review నిర్వహిస్తారు.

మార్చి 28న Mahakumbha Samprokshan నిర్వహించనున్న విషయం తెలిసిందే. అంతకు ముందు వారం రోజుల పాటు మహా సుదర్శన యాగం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలవుతాయి. ప్రధానఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బంగారు తాపడం పనులు చివరి దశలో ఉన్నాయి.

సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున దాదాపు 6వేల పై చిలుకు రిత్విక్కులు పాల్గొంటారు. దేశ విదేశాలనుంచి యాదాద్రి పునఃప్రారంభం వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు,  లక్షలాదిమంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం సమీక్షిస్తారు.  మహాకుంభ సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండడంతో అక్కడ యాగశాల నిర్మాణం, ఇతర పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. 

ఇదిలా ఉండగా,  Yadadri Sri Lakshmi Narasimha Swamyని దర్శించే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా.. Modern machineryతో.. మానవ ప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది.  మార్చి 28న లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలోPrasadam తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.  రోజుకు 70 వేలకు పైగా లడ్డూలు,  నాలుగు సార్లు ఒకేసారి 1000 కిలోల పులిహోర తయారు చేసే రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు. పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు.

ప్రత్యేక మెషిన్ లు…
ప్రసాదం కాంప్లెక్స్లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషిన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకు వచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా  భారీ మెషిన్ బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటార్లతో బెల్ట్ ను బిగించారు. ట్రేలలో  ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషిన్ వద్దకు తీసుకెళ్లేందుకు  బెల్ట్ ను బిగించారు. 

భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా పదమూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు.  యాదాద్రీశుడి ప్రసాదం తయారీని అధికారులు హరికృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా.. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలలో ప్రసాదం నాణ్యత పరిశీలించారు. మంగళవారం మూడో సారి ట్రై చేశారు, ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 

కాగా, వందల కోట్లు ఖర్చుచేసి ఈ ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించిన ప్రభుత్వం ఈ పవిత్ర కార్యంలో భక్తులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవాలయం తరహాలో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం  చేయించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ అందుకోసం భక్తులనుండే బంగారాన్ని సేకరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu