మంచిర్యాలలో విషాదం:పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

By narsimha lodeFirst Published May 15, 2022, 5:21 PM IST
Highlights

పెళ్లి ఇష్టం లేక కండె సంతీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. హాజీపూర్ లో  ఈ ఘటన, చోటు చేసుకొంది.  ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

 మంచిర్యాల: పెళ్లి ఇష్టం లేక కండె Satish  అనే  ఓ యువకుడు Suicide చేసుకున్నాడు. Mancherial జిల్లా Hajipur లో ఈ ఘటన చోటు చేసుకుంది. కండె సతీశ్‌ మంచిర్యాలలోని ఓ petrol బంక్ లో పనిచేస్తున్నాడు. సమీప గ్రామానికి చెందిన ఓ యువతితో ఈనెల 11న పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈనెల 25న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే పెళ్లి ఇష్టం లేదని చెప్పిన యువకుడు.. పెట్రోల్‌ బంక్‌లో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈనెల 12న బయటకు వచ్చాడు. శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్‌లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు.

also read:నిన్న సృజన.. నేడు లక్ష్మి.. మహబూబ్ నగర్ లో విషాదం.. పెళ్లైన కాసేపటికే నవ వధువు ఆత్మహత్య..

శనివారం ఉదయం గది తలుపు తీయలేదు. సిబ్బంది కిటికీలోంచి చూడగా సతీశ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. నిర్వాహకులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధారాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్‌ తెలిపారు.  ఇష్టం లేని పెళ్లి చేసేందుకు పేరేంట్స్ నిర్ణయం తీసుకోవడంతోనే సతీష్ ఆత్మహత్య చేసుకొన్నట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్టాల్లో సూసైడ్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. 
మరికొద్ది రోజుల్లో రిటైరవ్వాల్సి వుండగా ఇంతకాలం సేవలందించి బస్ డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడో ఆర్టిసి డ్రైవర్. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్టిసి అధికారుల వేధింపుల వల్లే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో మిర్యాల కిషన్  ఆర్టిసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా ఆర్టిసీ బస్సు నడుపుతూ సేవలందిస్తూ వచ్చిన ఆయన ఈ నెలాఖరులో రిటైర్ అవ్వాల్సి వుంది. 

తాను పనిచేసే ఆర్టిసి డిపోలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిపోలోని బంక్ లో డీజిల్  నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా బస్సుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హఠాత్తుగా కిషన్ కింద పడటంతో బస్సును ఆపడం డ్రైవర్ కు సాధ్యపడలేదు. దీంతో బస్సు కిషన్ పైనుండి వెళ్లడంతో  అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఇలా ఇంతకాలం పనిచేసిన బస్ డిపోలోనే  తోటి సిబ్బంది కళ్లముందే కిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అయితే ఆర్టిసి ఉన్నతాధికారుల వేధింపులే కిషన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు.  అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా అధికారులు మంజూరు చేయలేదని దీంతో తీవ్ర డిప్రెషన్ తోనే విధులకు హాజరైన అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన ఈ నెల 12న చోటు చేసుకొంది.

డ్రైవర్ కిషన్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు యాదగిరిగుట్ట బస్ డిపోకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ  జిల్లా  సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ శుక్రవారం నాడు తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ నెల 13న కోనసీమలో  సీఎం పర్యటన ఉంది. ఈ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన విధుల్లో పాల్గొని గురువారం నాడు రాత్రి ఇంటికి వచ్చాడు. గురువారం నాడు రాత్రి తన ఇంట్లోనే  గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తన చదువుకు సరిపడు ఉద్యోగం రాాలేదనే కారణంగానే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు. గోపాలకృష్ణ సూసైడ్ పై డీఎస్పీ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

click me!