ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆదివారం నాడు ఫోన్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడం పట్ల పార్టీ కార్యకర్తలను అభినందించారు. కష్టపడి పనిచేస్తున్నావని సంజయ్ ను మోడీ ప్రశంసించారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay కి ప్రధాని Narendra Modi ఆదివారం నాడు పోన్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ Praja Sangrama Yatra రెండో విడత విజయవంతం కావడంపై మోడీ అభినందించారు. కష్టపడి పని చేస్తున్నారని బండి సంజయ్ ను అభినందించారు. మరో వైపు ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేసిన కార్యకర్తలను కూడా మోడీ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని నిన్న తుక్కుగూడలో BJP సభను నిర్వహించింది.ఈ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
also read:తెలంగాణలో అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు: కాంగ్రెస్ నేత పీజేఆర్‌పై బీజేపీ నేత బండి ప్రశంసలు
undefined
Telangana రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యప్తంగా Padayatra చేయాలని కూడా బండి సంజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు
ఈ ఏడాది ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.ఈ నెల 14వ తేదీతో బండి సంజయ్ పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రను తుక్కుగూడలో ముగించారు బండి సంజయ్. ఈ సందర్భంగా బహింరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు. తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు. పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.
2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు
వచ్చే ఎన్నికలను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని కూడా పార్టీ సంస్థాగత కార్యక్రమాలను చేపట్టింది. మరో వైపు నేతల మధ్య ఉన్న అసంతృప్తులు, అబిప్రాయ బేధాలను పరిష్కరించే ప్రయత్నాలను కూడా జాతీయ నాయకత్వం చేపట్టింది. ఇటీవలనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ కూడా పార్టీ నేతలతో సమావేశమై దిశా నిర్ధేశం చేశారు.