‘దాడి’ శరణం గచ్ఛామి

Published : Feb 02, 2017, 12:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
‘దాడి’ శరణం గచ్ఛామి

సారాంశం

కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి

పీడిత కులాల సమస్యలు, అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిని కథాంశంగా ఎన్నుకొని తెలంగాణ దర్శకుడు తీసిన చిత్రం శరణం గచ్ఛామి. అయితే కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతివ్వడంలేదు. ఎన్నిసార్లు వేడుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

 

దీంతో ఆగ్రహం చెందిన చిత్ర యూనిట్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు ఈ రోజు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

కాగా, ఈ చిత్రం విడుదలైతే సమాజంలో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అందుకనే సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.

 

మరోవైపు పలు సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్‌సీ సూచించగా అందుకు దర్శకుడు ప్రేమ్ రాజ్ నిరాకరించారని అందుకే ఈ చిత్రానికి సెన్సార్ నుంచి అనుమతి రావడం లేదని వార్తలు వస్తున్నాయి.

 

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!