సంక్రాంతి ఎఫెక్ట్... నుమాయిష్ కి పోటెత్తిన సందర్శకులు

By telugu teamFirst Published Jan 15, 2020, 7:50 AM IST
Highlights

జనవరి 1న నుమాయిష్‌ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సుమారు మూడు లక్షలకు పైగా సందర్శకులు నుమాయి‌ష్ కు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉండడం, మంగళవారం భోగి పండగ కూడా తోడవ్వడంతో ఒక్కరోజే 60 వేల మంది నుమాయిష్ ను సందర్శించారు.
 

సంక్రాంతి పర్వదినం ఎఫెక్ట్ నాంపల్లిలోని నుమాయిష్ కి పడింది. పండగ నేపథ్యంలో వరస సెలవలు రావడంతో... నగరంలో సగం మంది తమ స్వగ్రామాలకు వెళ్లారు. స్వగ్రామాలకు వెళ్లకుండా.. నగరాల్లో ఉన్న ప్రజలంతా సందర్శన ప్రాంతాలపై పడ్డారు. ఈ నేపథ్యంలో నుమాయిష్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది.

జనవరి 1న నుమాయిష్‌ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సుమారు మూడు లక్షలకు పైగా సందర్శకులు నుమాయి‌ష్ కు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉండడం, మంగళవారం భోగి పండగ కూడా తోడవ్వడంతో ఒక్కరోజే 60 వేల మంది నుమాయిష్ ను సందర్శించారు.

Also Read కనువిందు చేస్తున్న కైట్స్ ఫెస్టివల్
 
పెద్దఎత్తున సందర్శకులు రావడంతో మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద కొనుగోళ్ల సందడి కనిపించింది. ఎటు చూసినా జనమే కనిపించారు. పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. గత ఐదు రోజులుగా నుమాయి్‌షకు రద్దీ పెరిగిందని, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయని వ్యాపారులు తెలిపారు. దేశంలో ఎక్కడా కనిపించని వస్తువులు నుమాయిష్‌లోని స్టాళ్లలో కనిపిస్తుండటం తో ఆసక్తిగా తిలకిస్తూ కొనుగోలు చేస్తున్నారు.
 
నుమాయి్‌షకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ బి. ప్రభాశంకర్‌, ఉపాధ్యక్షుడు సురేందర్‌, కోశాధికారి వినయ్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ బి. హనుమంతురావుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ బి. ప్రభాశంకర్‌ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరం కంటే ఈసారి పటిష్ఠమైన బందోబస్తును చేపట్టామని వివరించారు.

click me!