నో టిక్కెట్టు: కన్నీళ్లు పెట్టుకొన్న మాజీ మున్సిపల్ ఛైర్మెన్, సూసైడ్ యత్నం

By narsimha lodeFirst Published Jan 14, 2020, 4:17 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో  టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు  పార్టీ నాయకత్వంపై తమ నిరసనను పలు రూపాల్లో చూపిస్తున్నారు.

హైదరాబాద్:; మున్సిపల్ ఎన్నికల్లో  టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు  పార్టీ నాయకత్వంపై తమ నిరసనను పలు రూపాల్లో చూపిస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలో గంగాభవానీ అనే మహిళా కార్యకర్త పార్టీ కండువాతో ఉరేసుకొనేందుకు ప్రయత్నించింది. ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మనీషా కంటతడి పెట్టారు.


జనగామ మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు  టీఆర్ఎస్ టిక్కెట్టు కోసం గంగాభవానీ చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. కానీ, ఎమ్మెల్యే ఆమెకు టిక్కెట్టు  ఇవ్వలేదు,. ఆమె స్థానంలో మరోకరికి టిక్కెట్టు ఇచ్చారు. దీంతో గంగా భవానీ  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద హల్‌చల్  చేశారు.

పార్టీ టిక్కెట్టు తనకు దక్కలేదని తెలుసుకొన్న గంగాభవానీ పార్టీ కండువాతో ఉరేసుకొనే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడే పార్టీ కార్యకర్తలు ఆమెను అడ్డుకొన్నారు.

బీ-ఫారం దక్కలేదని టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

కంటతడి పెట్టిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మెన్

ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మనీషా తన నామినేషన్ ను బుధవారం నాడు ఉపసంహరించుకొన్నారు. నామినేషన్ ఉపసంహరించుకొన్న తర్వాత మనీసా కంటతడి పెట్టుకొన్నారు.

తన కొడుకును మున్సిపల్ ఛైర్మెన్ చేసేందుకు మాజీ మంత్రి జోగు రామన్న ప్రయత్నాలు చేస్తున్నారని మనీషా  చెప్పారు. ఈ కారణంగానే తాను నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతూ కన్నీళ్లు పెట్టుకొన్నారు.

బుధవారం నాడు ఉదయం సూర్యాపేట లో రహీం, మేడ్చల్ లో విజయ్ అనే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడ  టిక్కెట్లు దక్కలేదనే ఉద్దేశ్యంతో  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

click me!