జగ్గారెడ్డికి ఠాక్రే ఫోన్: మాణిక్‌రావు తో సంగారెడ్డి ఎమ్మెల్యే భేటీ

By narsimha lode  |  First Published Feb 16, 2023, 10:26 AM IST

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ   ఇంచార్జీ  ఇంచార్జీ మాణిక్ రావు  ఠాక్రే నేతలతో  వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  పార్టీ కార్యక్రమాలపై  సమీక్షలు నిర్వహిస్తున్నారు.



హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  గురువారం నాడు భేటీ అయ్యారు.  జగ్గారెడ్డికి  ఫోన్  చేసి   ఠాక్రే పిలిపించుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ   తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా  మాణిక్ రావు ఠాక్రే  ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు.  అయితే  ఠాక్రే  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  రాష్టానికి  చెందిన  పార్టీ నేతలతో  వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  అయితే  ఠాక్రేతో  జగ్గారెడ్డి  ఇంతవరకు  కలవలేదు.  అయితే  ఇవాళ జగ్గారెడ్డికి   ఠాక్రే ఫోన్  చేసి పిలిపించారు. రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులపై  జగ్గారెడ్డితో  ఠాక్రే  చర్చించే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

Latest Videos

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో  జగ్గారెడ్డి  పాదయాత్ర చేయనున్నారు.ఈ మేరకు  ఆయన  రూట్ మ్యాప్ ను సిద్దం  చేసుకంటున్నారు.  ఇతర జిల్లాల్లో  పాదయాత్రకు  తనను ఆహ్వానిస్తే  వెళ్తానని  జగ్గారెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే.   ఈ సమయంలో  జగ్గారెడ్డిని  ఠాక్రే పిలిపించుకోవడం  ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్రంలో  పార్టీని బలోపేతం  చేసేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై జగ్గారెడ్డితో  ఠాక్రే  చర్చించనున్నారని సమాచారం.  

ఈ ఏడాది  చివర్లో  తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం  పట్టుదలగా  ఉంది.  అయితే  పార్టీకి  చెందిన  నేతల మధ్య సమన్వయం లేదు.   పార్టీ నేతల మధ్య సమన్వయం  కోసం  పార్టీ నాయకత్వం  చర్యలు తీసుకుంటుంది.   అంతర్గత  విషయాలపై  నేతలంతా  పార్టీ సమావేశాల్లోనే చర్చించాలని నాయకత్వం  సూచనలు చేసింది.  

మాణికం ఠాగూర్  రాష్ట్ర ఇంచార్జీ  పదవి నుండి  తప్పుకొన్న తర్వాత  రేవంత్ రెడ్డి కూడా  కొన్ని కీలక  వ్యాఖ్యలు చేశారు.  పార్టీని  అధికారంలోకి తీసుకువచ్చేందుకు   తమ మధ్య  ఉన్న  అభిప్రాయబేధాలను కూడా పక్కన పెట్టాలని కూడా   రేవంత్ రెడ్డి  కోరారు.  ఈ విషయమై  అవసరమైతే  తాను  సామాన్య కార్యకర్త మాదిరిగా  కూడా  పనిచేసేందుకు  సిద్దమని  రేవంత్ రెడ్డి  ప్రకటించారు. 

also read:పొత్తు వ్యాఖ్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాక్రే షాక్

రెండు రోజుల క్రితం  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  చేసిన   పొత్తు వ్యాఖ్యలు  కలకలం  రేపాయి.   అసెంబ్లీ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య  పొత్తు ఉంటుందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను  కాంగ్రెస్  సీనియర్లు తప్పు బట్టారు. నిన్న  ఠాక్రేతో  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  సమావేశమయ్యారు. తన  వ్యాఖ్యలను ఠాక్రే లైట్ గా  తీసుకున్నారన్నారు. అయితే  పార్టీకి నష్టం  చేసేలా  ఎవరూ  వ్యాఖ్యలు  చేయవద్దని నిన్న  రేవంత్ రెడ్డి  కోరారు. 

click me!