నార్సింగిలో విషాదం: సూసైడ్ చేసుకున్న ప్రేమ జంట

By narsimha lode  |  First Published Feb 16, 2023, 9:48 AM IST

ఈ నెల  13వ తేదీన కన్పించకుండా  యువకుడు, వివాహిత  ఆత్మహత్య  చేసుకున్నారు.  నార్సింగి చెరువులో  వీరి మృతదేహలను పోలీసులు ఇవాళ వెలికి తీశారు.  



మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని  నార్సింగిలో అదృశ్యమైన  ప్రేమ జంట  ఆత్మహత్య  చేసుకుంది. ఆత్మహత్య  చేసుకున్న ప్రేమికుల్లో  యువతికి ఇటీవలనే వివాహం  జరిగింది. నార్సింగి చెరువు నుండి  మృతదేహలను  గురువారం నాడు ఉదయం వెలికి తీశారు.

ఈ నెల  13వ తేదీ నుండి  ప్రేమ జంట కన్పించకుండా పోయారు . ఈ విషయమై  బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు.   పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు  గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల  14న  నార్సింగి  చెరువు వద్ద    బైక్,  చెప్పులను  గుర్తించారు.  చెరువులో  దూకి  ఈ జంట ఆత్మహత్య  చేసుకుందని  భావించి  గాలింపు చర్యలు చేపట్టారు.   ఇవాళ ఉదయం మృతదేహలను చెరువు నుండి వెలికితీశారు. 

Latest Videos

నార్సింగికి  చెందిన  యువతి  కల్పన అదే ప్రాంతానికి  చెందిన  ఖలీల్ ప్రేమించుకున్నారు. ఇరువురి  మతాలు వేరు కావడంతో  పెళ్లికి ఇరు కుటుంబాలు  అంగీకరించలేదు. రెండు మాసాల క్రితం  యువతికి  పేరేంట్స్  మరో  యువకుడితో వివాహం  చేశారు.  ఈ నెల  14వ తేదీ నుండి  నార్సింగి చెరువలో  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం  వీరి మృతదేహలు లభ్యమయ్యాయి. 


 

click me!