హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో గుర్రపుస్వారీ బెట్టింగ్ : 13 మంది అరెస్ట్

Published : Feb 16, 2023, 10:17 AM IST
హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో గుర్రపుస్వారీ బెట్టింగ్ :  13 మంది  అరెస్ట్

సారాంశం

క్రికెట్ బెట్టింగ్ తరహలోనే  హర్స్ రైడింగ్  బెట్టింగ్ కి పాల్పడుతున్న  ముఠాను  హైద్రాబాద్ పోలీసులు  ఇవాళ అరెస్ట్  చేశారు.  రాజేంద్రనగర్ పరిధిలో  13 మందిని  పోలీసులు అరెస్ట్  చేసినట్టుగా  తెలిపారు.  

హైదరాబాద్:  నగరంలోని రాజేంద్ర నగర్ లో  గుర్రపు స్వారీ బెట్టింగ్  నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం నాడు అరెస్ట్  చేశారు.  రాజేంద్రనగర్ పరిధిలోని  తేజస్వినగర్ లో  ఓ ఇంటిపై  పోలీసులు దాడులు నిర్వహించారు. హర్స్ రైడింగ్  బెట్టింగ్ నిర్వహస్తున్న తిరుమల్ రెడ్డితో పాటు 13 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు.   వీరి నుండి  రూ. 51 వేలు,  17 ఫోన్లు , 19 డెబిట్ కార్డులు,  కారు సీజ్ చేశారు పోలీసులు.  నిందితుల నుండి  హర్స్ రైడింగ్  గైడ్  బుక్ ని  కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 
వాట్సాప్ గ్రూప్ క్రియేట్  చేసి ఆన్ లైన్  ద్వారా  బెట్టింగ్  నిర్వహిస్తున్నారని  పోలీసులు గుర్తించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sanathnagar TIMS Hospital: కార్పొరేట్ రేంజ్ ఫ్రీ వైద్యం.. సనత్‌నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవే
Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం