అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, నేను రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

Published : Jun 02, 2021, 01:52 PM IST
అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, నేను రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

సారాంశం

పీసీసీ చీఫ్ రేసులో తాను కూడ ఉన్నానని  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేసులో తాను కూడ ఉన్నానని  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు.బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  పీసీసీ చీఫ్ గా తనకు అవకాశం కల్పించాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు.  అధిష్టానం పీసీసీ చీఫ్ గా ఎవరినైనా నియమిస్తే తాము ఆపేది కాదన్నారు.  ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై పోరాటం చేయాలని భావిస్తే  కాంగ్రెస్ పార్టీలో చేరేవాడన్నారు. 

also read:సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఠాగూర్: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపికపై ఫోకస్

పీసీసీ చీఫ్ నియామకంపై అందరి అభిప్రాయం సేకరించి నియామకం చేపట్టాలని ఆయన కోరారు. పీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయమై సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరారు. త్వరలోనే పీసీసీకి కొత్త బాస్ నియామకం జరగనుంది.

ఈ తరుణంలో జగ్గారెడ్డి మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. పీసీసీ కొత్త బాస్ ఎంపిక కోసం ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలనే ఠాగూర్ సేకరించారు. ఈ తరుణంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేయడం చర్చకు దారితీసింది.

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu