కరోనాతో గాంధీభవన్ అటెండర్ మృతి...!

Published : Jun 02, 2021, 01:13 PM IST
కరోనాతో గాంధీభవన్ అటెండర్ మృతి...!

సారాంశం

హైదరాబాద్ గాంధీ భవన్ లో అటెండర్ గా పనిచేస్తున్న షబ్బీర్ అలియాస్ మహమ్మద్ షఫీ కరోనాతో మృతి చెందాడు.  షబ్బీర్ కి ఐదు రోజుల క్రితం కరోనా సోకింది.

హైదరాబాద్ గాంధీ భవన్ లో అటెండర్ గా పనిచేస్తున్న షబ్బీర్ అలియాస్ మహమ్మద్ షఫీ కరోనాతో మృతి చెందాడు.  షబ్బీర్ కి ఐదు రోజుల క్రితం కరోనా సోకింది.

వెంటనే గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. బుధవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

షబ్బీర్ గత మూడు దశాబ్దాలుగా గాంధీ భవన్ లో అటెండర్ గా సేవలు అందిస్తున్నాడు. గాంధీ భవన్ కు వచ్చే కార్యకర్తలకు, నేతలకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి షబ్బీర్. 

షబ్బీర్ అకాల మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు కుమార్ రావ్, బొల్లు కిషన్, నగేశ్ ముదిరాజ్ కార్యాలయ సిబ్బంది షబ్బీర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?