చంద్రబాబుకు ఝలక్: కేసీఆర్ కేబినెట్లో సండ్ర?

By narsimha lodeFirst Published Feb 15, 2019, 4:08 PM IST
Highlights

వరుసగా మూడు సార్లు సత్తుపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది

హైదరాబాద్: వరుసగా మూడు సార్లు సత్తుపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది. సండ్ర వెంకటవీరయ్యను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఈ కారణంగానే ఏపీ సర్కార్ ఇచ్చిన టీటీడీ మెంబర్‌ పదవిని కూడ సండ్ర వెంకటవీరయ్య తీసుకోలేదనే  ప్రచారం కూడ లేకపోలేదు. పార్టీ మారే విషయమై సండ్ర వెంకటవీరయ్య ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009, 2014,2018  ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆయన వరుస విజయాలు  సాధించారు. అయితే ఖమ్మం జిల్లా నుండి  టీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్క పువ్వాడ అజయ్‌ మినహా మాత్రమే విజయం సాధించారు.  మంత్రి తుమ్మల కూడ ఓడిపోయారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే టీఆర్ఎస్  పార్టీ ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆ పార్టీ గాలం వేస్తోంది. సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవి ఇస్తానని టీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

ఆశ్వరావుపేట నుండి టీడీపీ నుండి విజయం సాధించిన మచ్చా నాగేశ్వర్ రావును కూడ టీఆర్ఎస్‌లో చేర్చుకొనేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే మచ్చా నాగేశ్వర్ రావు మాత్రం తాను పార్టీ వీడనని చెబుతున్నారు.

సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని  ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు.

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీ బోర్డు మెంబర్ పదవిని చంద్రబాబునాయుడు మరోసారి ఇచ్చారు. అయితే ఈ బోర్డు పదవిని సండ్ర వెంకటవీరయ్య స్వీకరించలేదు. దీంతో శుక్రవారం నాడు ఈ నియామాకాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నందునే సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్ పదవి తీసుకోకుండా దూరంగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

దీంతో ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. సండ్రను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. వైరా నుండి ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన రాములు నాయక్‌ను టీఆర్ఎస్ లో చేర్చుకొన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే సండ్రకు చంద్రబాబు ఝలక్

19న విస్తరణ: కేసీఆర్ మంత్రివర్గంలో వీరికి ఛాన్స్

ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు

click me!