కేసీనో వ్యాపారం చేసిన చీకోటి ప్రవీణ్ కేసులో మరో పేరు తెరమీదికి వచ్చింది. చీకోటి ప్రవీణ్ తో సంపత్ కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులతో కూడా సంపత్ కు సంబంధాలున్నాయని కూడా ఈడీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: Casino వ్యాపారం చేసిన Chikoti Praveen కేసులో మరో పేరు తెరమీదికి వచ్చింది. చీకోటి ప్రవీణ్ తో Sampath కు సన్నిహిత సంబంధాలున్నాయని Enforcement Directorate అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. చీకోటి ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణకు గాను సంపత్ ఏకంగా రూ. 2 కోట్లను ఖర్చు చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. పుట్టిన రోజుకు ఖర్చు చేసిన ఈ డబ్బులను సంపత్ ఎక్కడి నుండి తెచ్చాడనే విషయమై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై సంపత్ ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.
కేసీనోలో ఆడేందుకు విదేశాలకు Hyderabad నుండి తీసుకెళ్లడానికి విమానాలను సంపత్ బుక్ చేసినట్టుగా కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలతో కూడా సంపత్ కు సంబంధాలున్నాయని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
undefined
బిగ్ డాడీ అడ్డా కోసం సంపత్ Cine Actors తారలను బుక్ చేసిన విషయాన్ని అధికారులు గుర్తించినట్టుగా ఆ కథనం వివరించింది. సంపత్ ఆర్ధిక కార్యకలాపాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో కూడా సంపత్ కు సంబంధాలున్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విషయమై సంపత్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఈ కథనం తెలిపింది.
సంపత్ విమాన టికెట్లుబుక్ చేస్తారని ఈడీ అధికారులు గుర్తించారు. మరో వైపు చీకోటి ప్రవీణ్ కేసీనో కోసం విదేశాలకు విమానాలను సంపత్ ను బుక్ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.ప్రవీణ్ కు సంపత్ తో పాటు ఇంకా ఎవరెవరు సహకరించారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ కు చెందిన లాప్ టాప్, మొబైల్ ను ఈడీ అధిారులు సీజ్ చేశారు. ప్రవీణ్ వాట్సాప్ డేటా ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ డేటాను అధికారులు రికవరీ చేశారు. వాట్సాప్ లో ఎవరెవరితో ప్రవీణ్ చాట్ చేశారనే విషయమై కూడా అధికారులు ఆరా తీశారు. ఈ చాటింగ్ ఆధారంగా ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు.
also read:చీకోటీ ప్రవీణ్ పామ్ హౌస్ లో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు: వైల్డ్ ఎనిమల్స్ గుర్తింపు
మరోవైపు ప్రవీణ్ కు చెందిన ఫామ్ హౌస్ లో వైల్డ్ ఎనిమిల్స్ ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇవాళ ఫారెస్ట్ అధికారులు కడ్తాల్ లోని ప్రవీణ్ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వైల్డ్ ఎనిమిల్స్ విషయమై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
కేసినో ఎక్కడ చట్టబద్దంగా నిర్వహించేందుకు అవకాశం ఉందో అక్కడే తాను కేసినో నిర్వహించినట్టుగా ప్రవీణ్ నిన్న మీడియాకు చెప్పారు. నేపాల్, గోవాలలో కేసినో చట్టబద్దంగా ఉందన్నారు. అక్కడ కేసినో నిర్వహించినట్టుగా ప్రవీణ్ వివరించారు. నేపాల్ తో పాటు ఇతర దేశాల్లో కేసినో ఆడేందుకు ఇక్కడి నుండి ప్రముఖులను ప్రవీణ్ తీసుకెళ్లాడు. 140 మంది చొప్పున విదేశాలకు మూడు దఫాలు తీసుకెళ్లినట్టుగా ఈడీ గుర్తించిందని ఎన్టీవీ కథనం తెలిపింది.