మహబూబాబాద్‌ గిరిజన స్కూల్‌లో పుడ్ పాయిజన్: నలుగురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

Published : Jul 29, 2022, 03:57 PM ISTUpdated : Jul 29, 2022, 05:02 PM IST
మహబూబాబాద్‌ గిరిజన స్కూల్‌లో పుడ్ పాయిజన్: నలుగురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

మహబూబాబాద్ గిరిజన పాఠశాలలో పుడ్ పాయిజన్ చోటు చేసుకొంది. పుడ్ పాయిజన్ కారణంగా నలుగురు విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 

మహబూబాబాద్: Mahabubabad గిరిజన బాలికల పాఠశాలలో Food Poison జరిగింది. దీంతో నలుగురు విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాము తిన్న ఆహారంలో వానపాము కన్పించిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో ఇటీవల కాలంలో పుడ్ పాయిజన్ ఘటనలు నమోదౌతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ లో పుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్ధి చనిపోయాడు. వరంగల్ జిల్లాకు చెందిన మరో విద్యార్ధి ఇంకా అనారోగ్యంగానే ఉన్నాడు. ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ జరిగింది. వందల మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ పుడ్ పాయిజన్ తో విద్యార్ధులు ఆందోళనకు కూడా సిద్దమయ్యారు.బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై విచారణ నిర్వహిస్తామని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. 

also read:బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజిన్.. 100 మంది విద్యార్ధులకు అస్వస్థత, మంత్రి సబిత సీరియస్

సిద్దిపేట జిల్లాలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ సుమారు 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన  ఈ ఏడాది జూన్ 27న చోటు చేసుకొంది. చికెన్ ను వంకాయతో కలిపి వండి విద్యార్ధులకు వడ్డించారు. ఈ భోజనం తిన్న విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిని  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఈ ఏడాది మార్చి 13న ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ లోని కేజీబీవీలో 70 మంది విద్యార్ధులు పుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులకు రిమ్స్ లో చికిత్స అందించారు. భోజనం తిన్న తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. 

ఈ ఏడాది మార్చి 13న ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ లోని కేజీబీవీలో 70 మంది విద్యార్ధులు పుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులకు రిమ్స్ లో చికిత్స అందించారు. భోజనం తిన్న తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. 35 మంది విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో పాటు ఇతరత్రా కారణాలతో విద్యార్ధులు తరచుగా అనారోగ్యానికి గురౌతున్నారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కేజీబీవీని సందర్శించారు.

2019 జనవరి ఆరో తేదీన  చేవేళ్ల హాస్టల్‌లో పుడ్‌పాయిజన్ కారణంగా 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన అధికారులు విద్యార్ధినులను ఆసుపత్రిలో చేర్పించారు. ఫ్రూట్ సలాడ్ తిన్న విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 


 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu