జడ్జిమెంట్ డే: సమత కేసులో నేడే తుది తీర్పు, ప్రజల్లో ఆసక్తి

By Siva KodatiFirst Published Jan 26, 2020, 9:47 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్‌లో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. 
 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్‌లో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. 

Also Read:సమత కేసు: 'ఊహాజనిత ఆధారాలతో చార్ఝీషీట్ దాఖలు'

సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు డిసెంబర్ 14న ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 140 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఎ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ లను నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఆ చార్జీషీట్ దాఖలు చేశారు. 

సమత కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సమతపై అత్యాచారం చేసి గొంతు కోసి ఆమెను చంపేశారని ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లో నిర్ధారించారు. చార్జిషీట్ లో ఫోరెన్సిక్ నివేదికను పొందుపరిచారు. డిఎన్ఎ పరీక్షల ద్వారా నిందితులను గుర్తించినట్లు, హతురాలి చీరెపై ఉన్న స్మెర్మ్ తో వారిని గుర్తించడం సాధ్యమైందని అంటున్నారు. 

Also Read:సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు

నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. సమత కేసును పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న ఇరు వర్గాల వాదలు విన్న న్యాయస్థానం తీర్పును జనవరి 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

click me!