హాజీపూర్ తుది తీర్పు: సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరేనా, తీర్పుపై ఉత్కంఠ..!!

By Siva KodatiFirst Published Jan 26, 2020, 8:59 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులపై ప్రభుత్వం నల్గొండ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.

Also Read:జాలి, దయ అక్కర్లేదు...హాజీపూర్ శ్రీనివాస్‌‌‌కి ఉరే సరి

ఇందుకు సంబంధించి గతేడాది అక్టోబర్ నుంచి ఈ నెల 17 వరకు వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును జనవరి 27కు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా సుమారు 101 మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికల అత్యాచారం హత్య కేసులో ఇంతకుమించి సంచలనం కలిగించింది. 2015 నుంచి గ్రామంలో కనిపించకుండా పోయిన మనీషా, కల్పన, శ్రావణి అనే బాలికలపై శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడు అత్యాచారం చేసి దగ్గరలోని బావిలో పూడ్చిపెట్టినట్లు గ్రామస్తులు అనుమానించారు.

అనంతరం పోలీసులు సైతం బావిలో తవ్వకాలు జరపగా.. మృతదేహాల ఆనవాళ్లు లభించాయి. ముగ్గురు మైనర్లపై హత్యాచారానికి పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు తరలించారు.

Also Read:హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను పూర్తి చేసింది. ప్రాసిక్యూషన్ సైతం నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్షను అన్ని విధాలా అర్హుడని వాదించింది. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం హత్యలు చేసిన ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఏం తీర్పును వెలువరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. 

click me!