తెలుగు అకాడమీ స్కాంలో సాయికుమార్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని తమ దర్యాప్తులో తేలిందని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. ఈ స్కామ్ లో ఇంకా కొందరిపై అనుమానాలున్నాయన్నారు. ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా సీపీ వివరించారు.
హైదరాబాద్: తెలుగు అకాడమీలో నిధుల స్కాంలో సాయి కుమార్ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.సాయికుమార్ పై ఇప్పటికే మూడు కేసులు నమోదైన విషయాన్ని సీపీ మీడియాకు వివరించారు. నిందితులను బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
also read:తెలుగు అకాడమీ స్కామ్ నిందితులు వీరే :రూ.324 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్
బుధవారం నాడు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 2020 నుండి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు telugu akademi లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను డ్రా చేశారని సీపీ అంజనీకుమార్ చెప్పారు.
ఈ స్కామ్ లో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ స్కామ్ పై తొలిసారిగా సెప్టెంబర్ 27న కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఇంకా కొంతమందిపై అనుమానాలున్నాయని hyderabad cp anjani kumar చెప్పారు. చందా నగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ sadana కూడ అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులపై గతంలో ఏమైనా కేసులున్నాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానితుల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు సీపీ. తెలుగు అకాడమీ కుంభకోణంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశామని ఆయన వివరించారు.
తెలుగు అకాడమీ పేరుతో నిందితులు ఏపీ మర్కంటైల్ బ్యాంకులో ఖాతాలు తెరిచారని, ఏపి మర్కంటైల్ బ్యాంక్ నుంచి వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని ఆయన చెప్పారు. సాయి కుమార్ కు ఎక్కవ మొత్తం వెళ్లిందని జాయింట్ కమిషనర్ మొహంతి చెప్పారు. ఆ డబ్బును కొంత మంది అప్పులు తీర్చడానికి వాడారని, కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. తెలుగు అకాడమీ ఏసీవో రమేష్ కు కూడా డబ్బులు వెళ్లాయని ఆయన అన్నారు.
సాయి కుమార్ వద్దకు వెళ్లేవారని, అతను తన ఏజెంట్లను పంపించేవాడని, తెలుగు అకాడమీ చెక్కులను వారు తీసుకునేవారని, చెక్కులనూ పేపర్లనూ ఏసీవో ఇచ్చేవాడని ఆయన చెప్పారు. డబ్బుల లావాదేవీలు, బదిలీలు ఎలా జరిగాయనే విషయాన్ని కూడా మొహంతి వివరించారు. దర్యాప్తు ముందుకు వెళ్తే గానీ మరిన్ని వివరాలు అందించలేమని ఆయన చెప్పారు. బ్యాంక్ మేనేజర్ తో ఫిక్స్ డ్ డిపాజిట్ల స్థితిని చెక్ చేసుకోలేదని ఆయన చెప్పారు.