కారులో చేలరేగిన మంటలు: బయటపడిన ఇద్దరు

Published : Oct 04, 2019, 11:34 AM ISTUpdated : Jan 29, 2020, 03:24 PM IST
కారులో చేలరేగిన మంటలు: బయటపడిన ఇద్దరు

సారాంశం

హైద్రాబాద్ నగరంలో ఓ ప్రమాద నుండి ఇద్దరు సురక్షితంగా తప్పించుకొన్నారు. ఈ ఘటన హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో చోటు చేసుకొంది.

హైదరాబాద్: హైద్రాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో  శుక్రవారం నాడు ఉదయం కారులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. ఈ ఘటన నుండి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

ఇద్దరు వ్యక్తులు మైలార్‌దేవ్‌పల్లి వద్ద కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు చేసుకొంది. కారులో మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరు కారు నుండి   బయటకు దిగారు. 

కారు నుండి  వెంటనే ఆ ఇద్దరు బయటకు దిగారు.  కారు నుండి బయటకు రాగానే  కారు మొత్తం మంటలతో దగ్దమైంది.  కారులో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై ఆరా తీస్తున్నారు.

గతంలో కూడ హైద్రాబాద్‌ పట్టణంలో కారులో మంటలు వ్యాపించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. కారులో షార్ట్‌ సర్క్యూట్  కారణంగా మంటలు వ్యాపించాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహలో కారులో మంటలు వ్యాపించిన ఘటనలో సజీవ దహనమైన ఘటనలు కూడ చోటు చేసుకొన్న సందర్భాలు కూడ చోటు చేసుకొన్నాయి. ఇవాళ జరిగిన ఘటనలో  మాత్రం ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ