సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపు సాయంత్రం సంబురాలు షురూ

By telugu teamFirst Published Nov 4, 2021, 8:26 PM IST
Highlights

హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి. నిర్వాహకులు దున్నరాజులతో సిద్ధంగా ఉండగా, ప్రభుత్వమూ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం ఈ సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి నారాయణగూడలో సదర్ సమ్మేళనం జరగనుంది. సదర్ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. మంత్రి తలసాని, ఇతర నేతలు రేవంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్, దానం నాగేందర్, రఘునందన్ రావు, ఇతర ప్రముఖులూ పాల్గొననున్నారు.
 

హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేని Sadar ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. నగర ప్రజలు సదర్ సంబురాలకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వమూ తగిన ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం సుమారు ఏడు గంటల నుంచి ఖైరతాబాద్‌లో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Hyderabad నగరంలో Narayanaguda, ఖైరతాబాద్, కాచిగూడ, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి, చప్పల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగ్, ఓల్డ్ సిటీ, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతియేటా దీపావళి తర్వాత నగరంలోని యాదవ్‌లు సదర్ ఉత్సవాలను ఉల్లాస ఉత్సాహాలతో నిర్వహిస్తుంటారు. ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెడతారు. వాటిని అలంకరించి ఊరేగిస్తారు. వీటి వెంట కుర్రకారు ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ప్రతియేటా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల్లో నారాయణగూడలో నిర్వహించే సంబురాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఈ నెల 5వ తేదీన ఖైరతాబాద్, ఎల్లారెడ్డి గూడ, లాల్ బజార్, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ సంబురాలు ప్రారంభం కానున్నాయి. కాగా, నారాయణగూడ సదర్ Celebrations మరుసటి రోజు అంటే 6వ తేదీన జరగనున్నాయి.

అయితే, ఈ సారి ఖైరతాబాద్‌లోనూ ఎంతమాత్రం తగ్గకుండా సదర్ ఉత్సవాలకు ప్లాన్ చేస్తున్నారు. నారాయణగూడ కంటే మించి ఉత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. సదర్ కోసం నగరంలోని యాదవ్‌లు పంజాబ్, హర్యానాల నుంచి దున్నరాజులను కొని తెస్తుంటారు. ఉత్సవాలకు ముందుగానే తెచ్చి వాటికి నాణ్యమైన దానా పెట్టి బలిష్టంగా తయారుచేస్తారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత డ్రైఫ్రూట్స్, అరటి పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం అందిస్తారు. దున్నపోతుల వీపులపై వెంట్రుకలు లేకుండా
చేస్తారు. ఆవాల నూనెతో మర్దన చేస్తారు.

Also Read: సదర్ ఉత్సవాలకు సన్నద్ధత.. నగరానికి ఖరీదైన హర్యానా దున్నలు.. సదర్ చరిత్ర ఇదే..!

Haryana నుంచి 16 కోట్లు వెచ్చించి తెచ్చిన దున్నలను ముషీరాబాద్‌లో పెంచుతున్నట్టు అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ వివరించారు. వీటి పేర్లు కింగ్, సర్తాజ్‌లు. ఈ దున్నరాజులను 
నారాయణగూడ సదర్‌లో ప్రదర్శించనున్నారు. కాగా, ఖైరతాబాద్‌లో రూ. 30 కోట్లతోషారూఖ్, రూ. 25 కోట్లతో లవ్రాణాలను తెచ్చి పెంచుతున్నారు.

1946లో హైదరాబాద్‌లో ప్రారంభమై ఈ ఉత్సవాలు క్రమంగా జిల్లాలకూ వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నారు. సాధారణంగా సదర్ ఉత్సవాలకు ముందు ఆ దున్నపోతులను అలంకరించి ప్రదర్శనకు 
ఉంచుతారు. ఇలాంటి ప్రదర్శనలనే తాజాగా, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. హైదరాబాద్‌లో దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు
వివరించారు. ఇతర జిల్లాలకూ సదర్ సంబురాలు వ్యాపించడం సంతోషదాయకమని తెలిపారు.

Also Read: భాగ్యనగరంలో ఘనంగా సదర్ ఉత్సవాలు... దున్నపోతుల ఆటలతో సందడి (ఫోటోలు)

సదర్ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. మంత్రి తలసాని, ఇతర నేతలు రేవంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్, దానం నాగేందర్, రఘునందన్ రావు, ఇతర ప్రముఖులూ పాల్గొననున్నారు.

click me!