తక్కువ ధరకే బంగారమంటూ టోకరా: నలుగురిని అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lodeFirst Published Nov 4, 2021, 4:44 PM IST
Highlights

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుండి రూ. 30 లక్షలను సీజ్ చేశారు.

హైదరాబాద్: తక్కువ ధరకే Gold Biscuit  ఇస్తామని మోసం చేస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ రఫిక్, బింగి శ్రీనివాస్, రెడ్డి పాండురంగారావు, ఎం. అన్వేష్ కుమార్ ల నుండి  పోలీసులు రూ. 30 లక్షల నగదు, నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ ముఠాకు చెందిన వివరాలను Hyderabad సీపీ Anjani kumarబుధవారం నాడు మీడియాకు వివరించారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన వికాఃస్ గౌతమ్, ముంబైకి చెందిన అమిత్ పటేల్ పరారీలో ఉన్నారని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.

also read:హైద్రాబాద్‌లో రూ.3.25 లక్షలు చోరీ, డబ్బులను టాయిలె‌లో వేశాడు: పోలీసులకు చిక్కాడిలా...

ఈ ముఠా సభ్యులపై పలు రాష్ట్రాల్లో సుమారు యాభైకి పైగా కేసులు నమోదయ్యాయన్నారు. కర్ణాటకకు చెందిన మహ్మదర్ రఫిక్, జగిత్యాలకు చెందిన బింగి శ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రెడ్డివారి పాండురంగారావు, మంచిర్యాలకు చెందిన అన్వేష్ కుమార్ లు పదేళ్ల క్రితం కలిశారు. ఈ నలుగురు కూడ బంగారం ప్రకటనలు చూసి మోసపోయారు. దీంతో తమను మోసం చేసినట్టుగా ఇతరులను మోసం చేయాలని ఈ ముఠా సభ్యులు ప్లాన్ చేశారు.

Dubai నుండి నాణ్యమైన బంగారం తెప్పిస్తున్నామని తక్కువ ధరకే బిస్కెట్లను ఇస్తామని మహ్మద్ రఫీక్ బృందం ఫేస్‌బుక్ లో ప్రకటనలు  ఇచ్చేవారు. ఈ ప్రకటనలు చూసిన ఢిల్లీకి చెందిన వికాస్ గౌతమ్, ముంబైకి చెందిన అమిత్ పటేల్ లు హైద్రాబాద్ కు వచ్చారు.అయితే బంగారం లేదని వీరిద్దరూ గ్రహించి రఫిక్ బృందాన్ని నిలదీశారు. తమతో కలవాలని వికాస్ గౌతమ్, అమిత్ పటేల్ లను రఫిక్ బృందం కోరింది. దీనికి వారిద్దరూ ఒప్పుకొన్నారు.

ఈ ముఠాతో కలిసిన వికాస్ గౌతమ్, అమిత్ పటేల్ లు ఫేస్‌బుక్ లో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని ప్రకటనలు ఇచ్చేవారు. ఈ ప్రకటనలు చూసి బంగారం కొనుగోలు కోసం వచ్చేవారిని బురిడీ కొట్టించేవారు.

బంగారం కొనుగోలు చేసేవారి వద్దకు రఫిక్ బృందం వెళ్లేది. రఫిక్ బృందం తమ వెంట నకిలీ కరెన్సీ కట్టలు,సూట్‌కేసులను తీసుకెళ్లేవారు. బంగారం కొనుగోలు చేసేవారిని బురిడీ కొట్టించి అసలు నగదును తీసుకొని నకిలీ కరెన్సీని సూట్ కేసులో అమర్చేవారు.  బంగారం తీసుకొస్తామని చెప్పి  నిందితులు వెళ్లి పోతారు. నెల రోజుల క్రితం అబ్దుల్ అఫ్రోజ్ అనే వ్యక్తి నుండి రూ. 40 లక్షలను నిందితులు దోచుకొన్నారు. తాను మోసపోయాయని  గుర్తించిన అఫ్రోజ్  పోలీసులను ఆశ్రయించాడు.ఈ ముఠాపై నిఘా వేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

బంగారం కోసం మోసపోయిన నిందితులు అదే మార్గంలో డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేశారు. అయితే  కొంత కాలంగా వీరంతా పోలీసులకు చిక్కకుండా డబ్బులు సంపాదించారు. అయితే చివరకు పోలీసులకు చిక్కారు.మహ్మద్ రఫిపై కర్ణాటకలో పలు కేసులు నమోదయ్యాయి. రఫిక్ కొంత కాలం పాటు సెకండ్ కార్ల వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశాడు. సిర్సి, హుబ్లి ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

click me!