డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..ఛలో కరీంనగర్ కి జేఏసీ పిలుపు

By telugu teamFirst Published Nov 1, 2019, 11:02 AM IST
Highlights

ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు బాబు ఇంటి వద్ద  పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐకాస నేతలతో చర్చలు ప్రారంభించే వరకు అంత్యక్రియలు చేయమని మృతుడి కుటుంబసభ్యులు కూడా తేల్చి చెప్పడం గమనార్హం.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కాగా.. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలు ఛలో కరీంనగర్ కి పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం బాబు అనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు బాబు అంత్యక్రియలు నిర్వహించమంటూ వారు తేల్చిచెప్పారు.

డ్రైవర్ బాబు ఇంటి వద్ద నేతలు ఆందోళన  చేపట్టారు.  గురువారం ఉదయం నుంచి కరీంనగర్ జిల్లా ఆరపల్లిలో వారు నిరసనలు చేపడుతున్నారు. ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు మృతదేహం వద్ద బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. వారితో పాటు ఆర్టీసీ ఐకాస నేతలు థామస్ రెడ్డి, రాజిరెడ్డి, కరీంనగర్ జిల్లా పరిధిలోని 2 ఆర్టీసీ డిపోల కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు.

RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ మృతి... కరీంనగర్ బంద్ పై పోలీసుల ఉక్కుపాదం

కాగా... ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు బాబు ఇంటి వద్ద  పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐకాస నేతలతో చర్చలు ప్రారంభించే వరకు అంత్యక్రియలు చేయమని మృతుడి కుటుంబసభ్యులు కూడా తేల్చి చెప్పడం గమనార్హం.

బంద్ నేపథ్యంలో శుక్రవారం కూడా గాంధీ సంకల్ప యాత్ర రద్దు చేసినట్లు ఎంపీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మరణించినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉమ్మడిగా బంద్ పాటించాలని ఆయా పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు. 

గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రభుత్వం స్పందించే వరకు అంత్యక్రియలు జరపబోమంటూ గురువారం ఉదయం నుంచి పట్టుబట్టిన బాబు కుటుంబ సభ్యులు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహా వివిధ పార్టీలు, సంఘాలు పాలకవర్గాల వైఖరికి నిరసనగా ఆందోళనబాట పట్టారు. 

read more RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరి వీడి, స్వయంగా ఆర్టీసీతో చర్చలు ప్రారంభిస్తేనే బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బంద్ లో స్కూళ్లు, కాలేజీలు, దుకాణదారులు, టీ, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు, ప్రజా, కుల సంఘాలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. 


 

click me!