triple talaq: పెళ్లైన ఐదు నెలలకే విడాకులు.. కారణం తెలిస్తే షాక్

By narsimha lodeFirst Published Nov 1, 2019, 10:56 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. పెళ్లైన ఐదు నెలలకే  భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు భర్త. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకొంది.


హైదరాబాద్: పెళ్లైన ఐదు నెలలకే అదనపు కట్నం  కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఈ మేరకు భర్తపైభార్యకుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:సరదాగా పార్టీకి వచ్చి మిత్రుడిని చంపేసి భార్యపై అత్యాచారం

హైద్రాబాద్‌ పట్టణంలోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన రుక్సానా‌ను ముస్తాఫా ఐదు మాసాల క్రితం వివాహం చేసుకొన్నాడు. వివాహం సందర్భంగా  అత్తింటి వారు అడిగిన వస్తువులను అన్ని కూడ తమ పుట్టింటి వాళ్లు ఇచ్చినట్టుగా రుక్సానా మీడియాకు చెప్పారు.

పెళ్లైన కొద్ది మాసాల వరకు తన భర్త ముస్తాఫా తనతో బాగా ఉన్నాడని రుక్సానా చెప్పారు. పెళ్లి సమయంలోనూ ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు తనతో పాటు తన కుటుంబసభ్యులతో అత్తింటివారు చాలా బాగా ఉన్నారని  రుక్సానా చెప్పారు.

ప్రపంచంలో ఇంత మంచి కుటుంబంతో తన కూతురికి సంబంధం దక్కినందుకు తమ పుట్టింటివాళ్లు చాలా ఆనందం వ్యక్తం చేశారని రుక్సానా చెప్పారు. అయితే పెళ్లైన రెండు మాసాల తర్వాత నుండి  తన భర్త ముస్తాఫా తనకు నరకం చూపించడం మొదలుపెట్టాడని బాధితురాలు ఆరోపించారు.

అంతేకాదు రుక్సానా పళ్లు ఎత్తుగా ఉన్నాయని కూడ భర్త  ముస్తఫా వేధింపులకు పాల్పడినట్టుగా  రుక్సానా కుటుంబసభ్యులు ఆరోపించారు. అదనపు కట్నం పేరుతో పాటు పళ్లు ఎత్తుగా ఉన్నాయని ఆరోపిస్తూ ముస్తఫా ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని బాధితురాలు చెబుతున్నారు.

ఈ వేధింపులు భరించలేక తాను కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలు చెప్పారు. మోడీ ప్రభుత్వం రెందో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ, లోక్ సభలో ఈ బిల్లు పాసైంది. 

 

click me!