ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాల్లో చేరడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు...మరికాసేపట్లో అందుకు సంబంధించిన ప్రకటన వెెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం గతకొంతకాలంగా తెలంగాణ ఆర్టీసి కార్మికులు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో కార్మికులు కూడా విధుల్లో చేరేది లేదని బీష్మించుకుని కూర్చుకున్నారు. ఈ సమయంలో సమ్మె విరమించి విధుల్లో చేరాలని కార్మికులకు సీఎం కేసీఆర్ మూడు రోజుల గడువు ఇచ్చారు. దాన్ని కూడా బేఖాతరు చేసిన కార్మికులు విధుల్లో చేరడానికి విముఖత వ్యక్తం చేశారు.
సీఎం ఆర్టీసి ఉద్యోగులకు సమ్మె విరమణ కోసం ఇచ్చిన గడువు నిన్న(మంగళవారం) అర్థరాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన ఈ సమీక్షలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.
undefined
రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిసేపటిక్రితమే సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. దీంతో మరికాసేపట్లో ప్రైవేట్ రూట్లపై సీఎం ప్రకటన చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
read more కేసీఆర్ లక్ష్యం అదే.... మిలియన్ మార్చ్ కు మా మద్దతు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్
ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులను తీసు కొస్తున్నట్టు ప్రకటించిన సీఎం మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. టికెటింగ్, టైమింగ్స్, రూట్స్ వీటన్నింటిపై మార్గదర్శకాలు సిద్ద మయ్యాయని సమాచారం. ప్రైవేట్ బస్సులను తీసు కొచ్చినా సరే అవన్నీ ఆర్టీసీ కార్పోరేషన్ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఆర్టీసీని ప్రైవేటీ కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. న్యాయ నిపుణులతో తాము సంప్రదింపులు జరిపామని... ఆర్టీసీలో 31శాతం కేంద్రం వాటా ఉందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి కేంద్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరించడం సాధ్యం కాదన్నారు.
read more విధుల్లో చేరినవారి శవాల ఊరేగింపు: ఆర్టీసీ కార్మికుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
కార్మికులకు చివరి అవకాశం ఇచ్చినా ఆర్టీసి యూనియన్లనే వారు నమ్మి ఉద్యోగాల్లో చేరలేదు. దీంతో సీఎం కేసీఆర్ కూడా వారికి మరో అవకాశం ఇవ్వడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అందువల్లే గతంలో ప్రకటించినట్లు మిగతా సగం ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేటికరించే ప్రయత్నంలో ఆయన వున్నట్లు తెలుస్తోంది.