విధుల్లో చేరినవారి శవాల ఊరేగింపు: ఆర్టీసీ కార్మికుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Nov 6, 2019, 6:02 PM IST

విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులపై ఆర్టీసీ జేఎసీ నేతలు బుధవారం నాడు మహాబూబ్‌నగర్ లో దాడికి దిగారు. ఈ ఘటనతో మహబూబ్‌నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ బస్ డిపోలో బుధవారం  నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. విధుల్లో చేరిన ముగ్గురు ఆర్టీసీ కార్మికుల ఫ్లెక్సీలను రోడ్డుపై ఊరేగించారు. విధుల్లో చేరిన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

Also Read:RTC Strike: కేసీఆర్ హెచ్చరికలు బేఖాతరు, మెట్టు దిగని కార్మికులు

Latest Videos

undefined

ఈ నెల 5వ తేదీ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించాడు. ఈ డెడ్‌లైన్‌తో మహబూబ్‌నగర్ డిపోలో ఇద్దరు డ్రైవర్లు,  ఓ కండక్టర్ విధుల్లో చేరారు.

వాజిద్, తాజీద్దున్ అనే డ్రైవర్లతో పాటు, కోమల అనే కండక్టర్ విధుల్లో చేరారు. దీంతో ఈ ముగ్గురు ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.విధుల్లో చేరి ఉద్యమానికి ద్రోహం చేస్తారా అని  ఆర్టీసీ జేఎసీ నేతలు విధుల్లో చేరిన కార్మికులపై దాడికి పాల్పడ్డారు.

Also Read:డెడ్‌లైన్ దాటితే ఉద్యోగాల్లోకి తీసుకోం.. ఆర్టీసీ ఇక లేనట్లే: తేల్చిచెప్పిన కేసీఆర్

డ్రైవర్లు తాజుద్దీన్, వాజిద్,  కండక్టర్ కోమలపై ఆర్టీసీ జేఎసీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే మహబూబ్‌నగర్ బస్ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది.

బస్సులో ఉన్న ముగ్గురు ఆర్టీసీ కార్మికులను జేఎసీ నేతలు చితక్కొట్టారు. కండక్టర్ కోమలను మహిళా కండక్టర్లు చితక్కొట్టారు. ఓ డ్రైవర్ ను బస్సు చుట్టూ తిప్పుతూ కొట్టారు.

మరో డ్రైవర్ దెబ్బలకు తాళలేక బస్సులో ఎక్కి కూర్చొన్నాడు. బస్సులో కూర్చొన్న కండక్టర్ కోమల చేతులను బస్సు కిటికీలో నుండి కిందకు లాగి  కొట్టే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో మహిళా పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొంటున్నా కూడ విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులను తరిమి తరిమి కొట్టారు. 


 

click me!