మిమ్మల్ని కలుసుకోవడం బాధగా ఉంది కానీ......: మంత్రి కేటీఆర్ భావోద్వేగం

By Nagaraju penumalaFirst Published Nov 6, 2019, 6:42 PM IST
Highlights

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదని తెలిపారు. 60 లక్షల మంది కార్యకర్తలను మనసున్న నేత, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అయిన సీఎం కేసీఆర్ చూసుకుంటారన్నారు. 
 

హైదరాబాద్: కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పార్టీ కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని తెలిపారు. 

ఇటీవల వేర్వేరు కారణాలతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కుల పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక లక్షలాది మంది కార్యకర్తల కృషి ఉందని కొనియాడారు. 

ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. కార్యకర్తలు కుటుంబాల యోగ క్షేమాల బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకుంటారని హామీ ఇచ్చారు. పార్టీ తరపున కార్యకర్తలకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. 

మీ కుటుంబ పెద్ద మనలో ఈరోజు లేకపోయినా, పార్టీ మాత్రం మీకెప్పుడు అండగా ఉంటుందనే ఒక విశ్వాసం మీలో నింపాలన్న ఉద్దేశ్యంతోనే ఈరోజు మిమ్మల్ని కొంత శ్రమ ఇచ్చైనా సరే పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. కొంత ఇబ్బంది అనిపించినా సరే ఇక్కడికి రావాలని ఆహ్వానించడం జరిగిందన్నారు.  

వేర్వేరు కారణాలతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల సభ్యులకు భీమా ఇవ్వడంతోనే మీతో మా అనుబంధం తీరిపోయిందనే మాట పొరపాటున కూడా అనుకోవద్దన్నారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు కూడా ఉంటాయని అన్నింటిలోనూ మీకు పార్టీ అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

తెలంగాణ భవన్ లో ఇటీవల చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలకు భీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 31కోట్ల 62 లక్షల  చెక్కులు ప్రదానం చేశారు. బాధిత కుటుంబాలను ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడం బాధాకరమే అయినప్పటికీ పార్టీ తరపున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదని తెలిపారు. 60 లక్షల మంది కార్యకర్తలను మనసున్న నేత, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అయిన సీఎం కేసీఆర్ చూసుకుంటారన్నారు. 

కుటుంబ పెద్దగా ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను వారు కడుపులో పెట్టి చూసుకుంటారని అందులో ఎలాంటి సందేహమే లేదన్నారు. 

ఎక్కడ చెక్కు ఇవ్వాల్సి వచ్చినా మన నాయకులే ఆ ఇంటికి వెళ్లి చెక్కులు ఇచ్చి వారికొక విశ్వాసాన్ని కల్పలించాలని సూచించారు.  

అలాగే కార్యకర్తల కష్టం గానీ సుఖంగానీ తెలుసుకుని వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషిచేయాలని సూచించారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

ఎక్కడికక్కడ, ఎవరి నియోజకవర్గాలకు వారు తప్పకుండా చెక్కు ఇచ్చే సందర్భంగా రొటీన్ గా కాకుండా మన పార్టీ తరఫున కార్యక్రమాన్ని కూడా ఒకటి వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా శాశ్వతంగా ఒక అనుబంధం ఆ కుటుంబానికి, మనకు ఉంటుందన్నారు. 

ఆ సందర్భంలో కుటుంబ పెద్ద చేసిన పనికి పార్టీ గుర్తించింది అన్న భావనతో కుటుంబ సభ్యులు ఆనంద పడతారని తెలిపారు. ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు. సాధించుకున్న ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాలను రైతులే కాని, పేదలే కాని, ఇంకా మహిళలే కాని, ఇతరులే కాని, కార్మికులే కాని, అందరినీ కూడా బాగా చూసుకోవాలన్నారు. 

తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశ్యంతో, ఒక దృఢ సంకల్పంతో పని చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడు మన కుటుంబ పెద్దగా ఉండటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల కుటుంబ సభ్యులతో విడివిడిగా కలుసుకొని వారి సమస్యలు పూర్తిగా విన్నారు. చివరగా అందరితో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్. 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్

ఆర్టీసీ సమ్మెపై వీడని కేసీఆర్ పట్టు: కాంగ్రెసులో హుజూర్ నగర్ సెగ...

click me!