జనగామ: బోల్తాపడిని ఆర్టిసి బస్సు... 10మంది ప్రయాణికులకు గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Oct 12, 2021, 05:24 PM IST
జనగామ: బోల్తాపడిని ఆర్టిసి బస్సు... 10మంది ప్రయాణికులకు గాయాలు

సారాంశం

ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. 

జనగామ: ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులతో పాటు బస్ డ్రైవర్, కండక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. 

వివరాల్లోకి వెళితే...  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి TSRTC కి చెందిన Bus ప్రయాణికులతో జగద్గిరిగుట్టకు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో  చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. బస్సు బోల్తాపడినప్పటికి ప్రయాణికులెవ్వరూ పెద్దగా గాయపడలేదు. బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు 10మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. 

read more  అనంతపురం: తల్లులు చూస్తుండగానే... చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం (వీడియో)

ఈ బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు