రేపు విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ

By narsimha lode  |  First Published Mar 8, 2023, 12:48 PM IST

రేపు విచారణకు  హాజరు కాలేనని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈడీకి  లేఖ రాశారు.  ఈ నెల  15 తర్వాత  విచారణకు  హాజరయ్యేందుకు  ఆమె  సుముఖతను వ్యక్తం  చేశారు.  


హైదరాబాద్:  రేపు విచారణకు  హజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈడీకి తెలిపారు. ఈ మేరకు  బుధవారం నాడు కవిత  ఈడీకి లేఖ రాశారు.  ఈ నెల  15వ తేదీన  తర్వాత  విచారణకు  హాజరుకానున్నట్టుగా  కవిత  ఆ లేఖలో  పేర్కొన్నారు. 

ఈ  నెల  10వ తేదీన  ఢిల్లీలో  దీక్ష  ఉందని   ఆ లేఖలో  కవిత  పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దీక్షకు సంబంధించి  ఏర్పాట్లు  కూడా  పూర్తయ్యాయని  కూడా  కవిత  పేర్కొన్నారు.  ఈ దీక్ష  నేపథ్యంలో  రేపు విచారణకు  హాజరు కాలేనని కవిత  పేర్కొన్నారు.  ఈ నెల  15వ తేదీ తర్వాత  విచారణకు  హాజరయ్యేందుకు  సానుకూతను వ్యక్తం  చేశారు.   ఈ నెల  9వ తేదీ నుండి  తనకు  ముందుగా  నిర్ణయించుకున్న కార్యక్రమాలు  ఉన్నాయని ఆ లేఖలో  కవిత  తెలిపారు.  ఈ కార్యక్రమాల నేపథ్యంో విచారణకు  రాలేనని  కవిత   చెప్పారు.  

Latest Videos

ఇవాళ  ఉదయం కల్వకుంట్ల కవితకు  ఈడీ  అధికారులు నోటీసులు పంపారు.  రేుపు విచారణకు  రావాలని ఆ లేఖలో  పేర్కొన్నారు.  నిన్ననే  అరుణ్ రామచంద్ర పిళ్లైని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై  రిమాండ్  రిపోర్టులో  కవిత  పేరు ప్రస్తావించారు దర్యాప్తు అధికారులు.  కవిత  ప్రతినిధిగా అరుణ్ రామచంద్రపిళ్లై  వ్యవహరించారని ఆ  రిపోర్టులో  పేర్కొన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్లైని  అరెస్ట్  చేసిన మరునాడే  కవితకు  నోటీసులు  జారీ చేశారు.

ప్రస్తుతం ఈడీ కస్టడీలో   ఉన్న  అరుణ్  రామచంద్ర పిళ్లైతో  కలిపి కవితను  విచారించే అవకాశం లేకపోలేదు.  ఈ కారణంగానే ఆమెను రేపు విచారణకు  రావాలని కోరినట్టుగా  నోటీసులు  ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ విషయమై కవిత  ఇవాళ  ఈడీకి  సమాధానం ఇచ్చారు.  కవిత రాసిన లేఖపై  ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారోననే విషయమై  ప్రస్తుతం  ఉత్కం ఠ నెలకొంది. 

also read:కవితకు నోటీసులతో మాకేం సంబంధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గత ఏడాది డిసెంబర్ మాసంలో  విచారణకు  రావాలని  సీబీఐ నోటీసులు జారీ చేసింది. తొలుత డిసెంబర్  6న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.  అయితే   ఆ రోజున తనకు  వేరే కార్యక్రమాలున్నాయని కవిత  సీబీఐకి తెలిపింది. మరో రోజున విచారణకు  సమయం కావాలని లేఖ రాసింది. కవిత  వినతి మేరకు  సీబీఐ అధికారులు డిసెంబర్  11న కవితను  ప్రశ్నించారు.  

click me!