అమ్మ మీద శానిటైజర్ పోసి నిప్పంటించాడు.. అడ్డువెళ్లిన మా మీద కూడా...తల్లి హత్యలో తండ్రి పాత్ర బయటపెట్టిన కూతురు

Published : Mar 08, 2023, 12:39 PM ISTUpdated : Mar 08, 2023, 12:41 PM IST
అమ్మ మీద శానిటైజర్ పోసి నిప్పంటించాడు.. అడ్డువెళ్లిన మా మీద కూడా...తల్లి హత్యలో తండ్రి పాత్ర బయటపెట్టిన కూతురు

సారాంశం

తన తల్లిని పథకం ప్రకారం తండ్రే చంపాడని మేడ్చల్ నవ్యశ్రీ మృతి కేసులో ఆమె కూతురు వాంగ్మూలం ఇచ్చింది. 

హైదరాబాద్ : హైదరాబాదులోని మేడ్చెల్ లో జరిగిన ఓ హత్య ఉదాంతంలో కూతురు హంతకుడైన తండ్రిని పట్టించింది. కట్టుకున్న భార్యను పథకం ప్రకారం హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకో చూసిన భర్త దురాగతాన్ని వారి కూతురే బయటపెట్టింది. తిరునగర్ నవ్యశ్రీ (33), నాగేందర్ దంపతులు. వీరు సిద్దిపేట జిల్లా ములుగు మండలం తుంకి బొల్లారం గ్రామానికి చెందినవారు. ఈ దంపతులకు చందన, మేఘన అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు మేడ్చల్ లోని పూర్ణా నగర్ కాలనీలో ఉంటున్నారు.

ఫిబ్రవరి 20న శివరాత్రి నాడు నవ్య శ్రీ  మరణించింది. శివరాత్రి కావడంతో  పూజ కోసం అగ్గిపెట్టె వెలిగించగా.. అది ఆమె చీరపై పడి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని మొదట పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాదు నవ్యశ్రీ కూడా తన వాంగ్మూలంలో అదే విషయాన్ని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను ప్రాథమిక చికిత్సల తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న నవ్యశ్రీ  ఈనెల 5వ తేదీన మృతి చెందింది.

పెళ్ళి జరగడం లేదని మేనమామను హత్య చేసి, శవాన్ని రైల్వైట్రాక్స్ పక్కన పడేసిన మేనల్లుడు..

కాగా ఈనెల ఆరవ తేదీన  మేడ్చల్ పోలీస్ స్టేషన్లో పెద్దకూతురు చందన తన తల్లిని తండ్రి నాగేంద్ర చంపాడని స్టేట్మెంట్ ఇవ్వడంతో అది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన విషయం కూడా కాదని..  పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు గుర్తించారు. తండ్రి అయిన నాగేందర్ తల్లి ఒంటిమీద శానిటైజర్ పోసి.. ఆ తర్వాత నెప్పంటించాడని.. తాము అడ్డు వెళితే తమ మీద కూడా శానిటైజర్ పోసాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ దృశ్యాలన్నీ  అక్కడే ఉన్న సీసీ కెమెరాలు కూడా రికార్డు అయ్యాయి. దీంతో ఈ మేరకు నాగేందర్ మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu