ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసుల విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు
న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేమిటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారంనాడు మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మీ తప్పులను ప్రశ్నిస్తే తెలంగాణ సమాజానికి ఆపాదిస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెడుతున్నారన్నారు. ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమ సంపాదన చేసింది మీరేనని కవితనుద్దేశించి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగస్వామ్యమై సంపాదించారన్నారు.
also read:కవిత ఇంటి వైపు వెళ్లే దారుల మూసివేత: భారీ బందో బస్తు
undefined
చట్టం ముందు అందరూ సమానమేనని కిషన్ రెడ్డి చెప్పారు. దర్యాప్తు సంస్థల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెడుతున్నారన్నారు లక్షల విలువ చేసే ఫోన్లు పగులగొట్టారని ఆయన ఆరోపించారు. సీబీఐ రోజుకో కేసు పెడుతుందన్నారు. మీరు తప్పు చేసిన విషయాన్ని గుర్తించి ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి అపాదిస్తారా అని ఆయన అడిగారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తే తెలంగాణ సర్కార్ లా తాము అడ్డుకోమన్నారు. నిజంగా నీతి మంతులైతే దేనికి భయపడరని ఆయన చెప్పారు. మీరు మీ కుటుంబమే తెలంగాణ సమాజమా..? మేము, ప్రజలు తెలంగాణ సమాజం కాదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
గవర్నర్ ను అవమానిస్తారు.. మాపై కేసులు పెడతారు.. పాదయాత్రులు చెయ్యనివ్వరు.. మేం ఉత్తరాలు రాస్తే స్పందించరని కిషన్ రెడ్డి చెప్పారు. సీబీఐ, ఈడీ గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా అనేక కేసుల్లో చాలా మందిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు..శాసన సభలో తెలంగాణ సమస్యలపై కాకుండా మోడీని తిట్టడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు కిషన్ రెడ్డి. శాసన సభను కేంద్రాన్ని, మోదీని తిట్టడానికి వేదికగా వాడుకున్నారన్నారు. ఇలాంటి వారు దేశంలో గుణాత్మకమైన మార్పును తీసుకువస్తారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీనే సమర్థవంతమైన పాలన అందించగలుగుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం కంటే 100 రెట్లు మెగుగైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ధీమాను వ్యక్తం చేశారు.