ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేస్తాం: కేసీఆర్ హామీ

By narsimha lodeFirst Published Oct 18, 2021, 7:39 PM IST
Highlights

వర్షాకాలంలో ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఆయన సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా Paddyసేకరణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి Kcrప్రకటించారు. సోమవారం ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.  

also read:‘ఆంధ్రప్రదేశ్ బాటలో కేరళ.. ఏపీ విధానాలపై ఆ రాష్ట్ర సాగు మంత్రి అధ్యయనం’

గత సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం civil supply శాఖాధికారులను ఆదేశించారు. 

ధాన్యం కొనుగోలు విషయంలో Farmers ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం సీఎం  కేసీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం  కేసీఆర్  సూచించారు.  మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

click me!