Kamareddy: కామారెడ్డికి ఆర్టీసీ బస్సులో వెళ్లుతున్న సిరిసిల్ల వ్యక్తి వద్ద రూ. 25 లక్షలు సీజ్

By Mahesh K  |  First Published Nov 20, 2023, 9:45 PM IST

రాజన్న సిరిసిల్లకు చెందిన వ్యక్తి రూ.25 లక్షల నగదుతో ఆర్టీసీ బస్సులో కామారెడ్డికి వెళ్లుతున్నాడు. మనోహరాబాద్ మండలంలో మెదక్ పోలీసులు తనిఖీలు చేయగా.. ఈ విషయం బయటపడింది. అయితే.. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి గజ్వేల్ టౌన్ పోలీసు స్టేషన్‌కు పంపించారు.
 


హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ధనప్రవాహం రోజు రోజుకీ పెరిగిపోతున్నట్టు తెలుస్తున్నది. పట్టుబడుతున్న డబ్బు పెరుగుతుండటంతో ఈ విషయం అర్థం అవుతున్నది. సాధారణ పౌరులైనా డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకెళ్లితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు వెంటు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా వరకు ఆ ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి చాలా సాధారణ ప్రయాణికుడిగా ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కానీ, తనిఖీల్లో ఆయన వద్ద రూ. 25 లక్షలు వెలుగు చూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కామారెడ్డికి బస్సులో వెళ్లుతున్నాడు. ఎన్నికల సీజన్ కావడంతో ఆ డబ్బుపై అనేక అనుమానాలు ముసురుతున్నాయి.

గంబీరావ్ పేటకు చెందిన కాలకుంట్ల నరేందర్ రూ. 25 లక్షలు పట్టుకుని టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆయన కామారెడ్డికి వెళ్లుతున్నాడు. అయితే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ఎన్‌హెచ్ 44 పై కల్లకల్ చెక్ పోస్టు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సదరు వ్యక్తి వద్ద రూ. 25 లక్షలు పట్టుబడ్డాయి.

Latest Videos

Also Read: Sam Altman: సామ్ ఆల్ట్‌మన్‌ను వెనక్కి తీసుకోకుంటే రాజీనామా చేస్తాం: 500 Open AI ఉద్యోగుల లేఖ

మెదక్ పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ టౌన్ పోలీసు స్టేషన్‌కు పంపించారు. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న వ్యక్తి వద్ద ఆ డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు లేవు. దీంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. అలాగే.. ఈ విషయాన్ని ఐటీ నోడల్ అధికారికి కూడా పోలీసులు తెలియజేశారు.

click me!